Site icon NTV Telugu

AP Cabinet: రేపు ఏపీ కేబినెట్‌ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet: రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలోని బ్లాక్ 1లో సమావేశం నిర్వహించనున్నారు. మిచౌంగ్ తుఫాన్, పంట నష్టం, ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలు, జనవరి 1 నుంచి 3 వేల రూపాయలకు పెన్షన్ పెంపు, జనవరిలో వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాలకు నిధుల విడుదల సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

Read Also: Big Breaking: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వారికి గన్ మెన్లు తొలగింపు..

శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ బాధితుల కష్టాలను శాశ్వతంగా రూపుమాపేందుకు ముందడుగు వేసిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. ఇప్పుడు వారికి కావాల్సిన అన్ని సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. కంచిలి మండలం మకరాంపురంలో వైఎస్సార్‌ సుజలధార డ్రింకింగ్‌ వాటర్‌ ప్రాజెక్టును గురువారం ప్రారంభించారు… రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన సుజలధార ప్రాజెక్టు జాతికి అంకితం చేశారు ఏపీ ముఖ్యమంత్రి. పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌తో పాటు, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు.. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో పాటు అన్ని రకాల కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, డయాలసిస్‌ యూనిట్ల ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

Read Also: TDP MPs: కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసిన టీడీపీ బృందం

గతంలో ఆస్పత్రికి, డయాలసిస్‌కు సుధూర ప్రాంతాలకు వెళ్లే దుస్థితి ఉండగా.. ఇప్పుడు మూడు బ్లాకులుగా నాలుగు అంతస్తుల్లో ఆస్పత్రి నిర్మాణం చేశారు. క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, పాథాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ ల్యాబ్స్, సెంట్రల్‌ ల్యాబ్స్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్‌ మెడిసిన్, సర్జరీ, డయాలసిస్, పోస్ట్‌ ఆపరేటివ్, ఐసీయూ, రీసెర్చ్‌ ల్యాబ్‌ ఇలా అన్నింటికీ ప్రత్యేక వార్డులు కేటాయించారు.. మరోవైపు.. ఈ ఆస్పత్రి, రీసెర్చ్‌ కు కావాల్సిన వైద్యులు, సిబ్బంది పోలీసులను కూడా ప్రభుత్వం భర్తీ చేసింది. ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలందించేందుకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం సుమారు రూ.74.24 కోట్లు వెచ్చించింది. 200 పడకల ఆసుపత్రిలో రోగులకు డయాలసిస్ మరియు ఇతర వైద్య సదుపాయాలు ఉన్నాయి.. ఇప్పటి వరకు చికిత్స కోసం విశాఖపట్నం వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ (ICMR) ఈ ప్రాంతంలోని దాదాపు 700 గ్రామాలలో ప్రబలంగా ఉన్న దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధిపై పరిశోధనకు మద్దతు ఇస్తుంది.

Exit mobile version