Site icon NTV Telugu

AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. మద్యం పాలసీ, మైనింగ్ పాలసీలపై చర్చ

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet: ఇవాళ ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. మద్యం పాలసీ, మైనింగ్ పాలసీలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. మద్యం పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులను కేబినెట్ సమీక్షించనుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీఅమలుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మద్యం పాలసీపై మ ప్రతిపాదనలను కేబినెట్‌ ముందు మంత్రివర్గ ఉపసంఘం ఉంచనుంది. కేబినెట్‌ సబ్‌ కమిటీ ప్రతిపాదనలపై మంత్రివర్గంలో చర్చ జరగనుంది. అనంతరం నూతన మద్యం పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లపై మంత్రి వర్గం ఆమోద ముద్ర వేయనుంది. వరద సాయం, ఇసుక పాలసీ అమలు వంటి వాటి పైనా కేబినెట్‌లో ప్రస్తావనకు రానున్నట్లు తెలుస్తోంది.

Read Also: Ganesh Immersion: రెండోరోజు కొనసాగుతున్న గణనాథుల నిమజ్జనం..

Exit mobile version