NTV Telugu Site icon

AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. చర్చించే అంశాలు ఇవే!

Ap Cabinet Meeting

Ap Cabinet Meeting

ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ భేటీ కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశం అనంతరం గడిచిన ఆరు నెలల పాలన, రానున్న ఏడాది పాలనలో తీసుకురావాల్సిన మార్పులపై మంత్రులకు సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు. కేబినెట్‌ భేటీలో చర్చించే అంశాలు ఏంటో చూద్దాం. ఎస్‌ఐపీబీ అమోదించిన లక్ష 80 వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్‌ అమోదం తెల‌ప‌నుంది. ఈ పెట్టుబడుల ద్వారా 2,63,411 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశముంది. నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ.96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు కేబినెట్‌ అమోదం తెల‌ప‌నుంది.

# విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీసీఎస్ రూ.80 కోట్ల పెట్టుబడుల‌కు అమోదం

#శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ సంస్ధ‌ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్‌ల కోసం రూ.1,046 కోట్ల పెట్టుబడుల‌కు అమోదం

# అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.1,174 కోట్ల పెట్టుబ‌డుల‌కు అమోదం

# రాష్ట్రంలో కొత్త‌గా ఐదు సంస్థలు క్లీన్ ఎన‌ర్జీలో రూ.83 వేల కోట్ల పెట్టుబడుల‌కు అమోదం

# ఏఎం గ్రీన్ అమ్మోనియా (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలో 592 ఎకరాల్లో రూ.12,000 కోట్ల పెట్టుబడుల‌కు అమోదం

# జాన్ కోకిరిల్ గ్రీన్‌కో హైడ్రోజన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలో 2 వేల కోట్లతో 40 ఎకరాల్లో 2 గిగావాట్ల సామర్ధ్యం కలిగిన ఎలక్ట్రోలైజర్ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్కు అమోదం

# కర్నూలు జిల్లాలోని హోసూరు,పెద్ద హుల్తిలో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ 1,800 ఎకరాల్లో 2 వేల కోట్లతో ఏర్పాటు చేయ‌నున్న‌ 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుకు అమోదం

# వైఎస్సాఆర్ జిల్లాలోని మైలవరం, కొండాపురం.. నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్లలో క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ త్రీ ప్రైవేట్ లిమిటెడ్ 1,080 ఎకరాల్లో రూ.2,000 కోట్ల పెట్టుబడుల‌కు అమోదం

# 119 మెగావాట్ల విండ్ పవర్, 130 మెగావాట్ల సోలార్ హైబ్రీడ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు అమోదం

# రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రాష్ట్రంలో 65 వేల కోట్ల రుపాయిల‌తో 5 లక్షల ఎకరాల్లో 11 వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటుకు అమోదం

Show comments