Site icon NTV Telugu

AP Cabinet: పోలవరం లేనిచోట పోలవరం జిల్లా ఏంటి?.. సీఎం చంద్రబాబుకు మంత్రి ప్రశ్న!

Kandula Durgesh vs CM Chandrababu

Kandula Durgesh vs CM Chandrababu

ఈరోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ భేటీలో.. పలు అభివృద్ధి పనులు, జిల్లాల మార్పు, పరిపాలనా అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ప్రముఖుల పేర్లు జిల్లాలకు పెట్టడంపై క్యాబినెట్లో సీఎం చంద్రబాబు, మంత్రుల మధ్య ఆసక్తికర చర్చ నడించింది. ఈ క్రమంలోనే పోలవరం విషయంలో సీఎంను మంత్రి కందుల దుర్గేష్ ఓ ప్రశ్న అడిగారు. అందుకు చంద్రబాబు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

Also Read: Vellampalli Srinivas: ఈ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు రక్షణ లేదు!

పోలవరం లేనిచోట పోలవరం జిల్లా ఏంటి? అని మంత్రి కందుల దుర్గేష్ అడగగా.. నిర్వాసితులు ఉన్నారనే జిల్లా పేరు అలా మార్చాల్సి వచ్చిందని సీఎం చంద్రబాబు బదులిచ్చారు. ఎన్టీఆర్ ఊరు లేకుండా ఎన్టీఆర్ జిల్లా పేరు ఉంది కదా అని మంత్రితో సీఎం అన్నారు. మహానుభావుల పేర్లు ఉన్నాయనేది చూడాలని సీఎం చెప్పుకొచ్చారు. పశ్చిమ గోదావరి మినహా ప్రతి జిల్లాకు ఒక పోర్టు ఉండేలా చూశామని మంత్రులతో సీఎం చెప్పారు. ప.గో. జిల్లాలోనూ పోర్టు ఏర్పాటుకు స్టడీ చేయాలని సీఎం సూచించారు. విద్యుత్ ఛార్జీలను యూనిట్‌కు 13 పైసలు ట్రూడౌన్ చేశామన్నారు. కుప్పం, దగదర్తిలో విమానాశ్రయాలు అభివృద్ధి చేయాలన్నారు. ఐరాస.. క్వాంటం సదస్సును అమరావతిలో పెడుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Exit mobile version