NTV Telugu Site icon

AP Cabinet Key Decisions: ఏపీ తొలి కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

Cabinet

Cabinet

AP Cabinet Key Decisions: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మూడున్నర గంటలపాటు సాగిన సమావేశంలో.. కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.. అంతేకాదు.. కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు.. ముఖ్యంగా సీఎం చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.. మెగా డీఎస్సీ, పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్లు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, స్కిల్ సెన్సస్ కు మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది.. ఇక, హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..

Read Also: PM Modi: దేశ చరిత్రలో ‘ఎమర్జెన్సీ’ ఒక మచ్చ.. ఆ పొరపాటు మళ్లీ జరగొద్దు

మరోవైపు.. కేబినెట్‌ భేటీలో శ్వేత పత్రాల విడుదలపై చర్చ జరిగింది.. ఏడు అంశాలపై శ్వేత పత్రాల విడుదలకు నిర్ణయం తీసుకున్నారు.. గత ప్రభుత్వ పరిపాలనపై శ్వేత పత్రాలు విడుదల చేయడం వల్ల ప్రజలకు వాస్తవాలు తెలపాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు చంద్రబాబు. వ్యవస్థలను పరిపాలనను వైఎస్‌ జగన్ ప్రభుత్వం ఏ స్థాయిలో ధ్వంసం చేసిన విధానాన్ని వైట్ పేపర్లలో తెలపాలని పలువురు మంత్రులు సూచించగా.. ఏయే అంశాలపై శ్వేత పత్రాలు విడుదల చేయొచ్చని మంత్రుల అభిప్రాయాలు కోరారు సీఎం చంద్రబాబు. ముఖ్యంగా పోలవరం, అమరావతి, పర్యావరణం, శాంతి భద్రతలు, ఫైనాన్స్, పవర్, మద్యం అంశాలపై శ్వేత పత్రాల విడుదలకు నిర్ణయం తీసుకున్నారు.. పర్యావరణంలో భాగంగా ఇసుక, గనుల విషయమై శ్వేత పత్రాల విడుదలకు నిర్ణయించింది ఏపీ కేబినెట్‌.

Read Also: MLA Rajasingh: ఫేక్‌కాల్స్‌కు స్పందించొద్దు.. గోషామహల్ ప్రజలకు ఎమ్మెల్యే రాజాసింగ్ సూచన

ఇక, గంజాయి, డ్రగ్స్ నివారణపై కేబినెట్‌లో కీలక చర్చ సాగింది.. 100 రోజుల్లో డ్రగ్స్ అరికట్టేలా యాక్షన్ ప్లాన్‌పై కేబినెట్‌లో ప్రస్తావనకు వచ్చింది.. మత్తు పదార్థాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలకు కేబినెట్ సబ్ కమిటీ నియమించారు. కేబినెట్‌ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, సంధ్యారాణి, సత్యకుమార్, కొల్లు రవీంద్రని నియమించారు.. మరోవైపు ఫింఛన్లను జులై ఒకటిన సచివాలయ సిబ్బంది ద్వారా పేదలకు ఇళ్ల వద్దే అందించాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్‌.. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా కాకుండా గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీకి నిర్ణయం తీసుకున్నారు.. ఇక, గంజాయి నిర్మూలనపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు.. అన్న క్యాoటీన్లు వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. ముందుకొచ్చే దాతల సహకారమూ తీసుకోవాలని సూచించారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అయితే, కేబినెట్‌ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి పార్థసారథి.. కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.. ఇంకా ఆయన ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..