NTV Telugu Site icon

AP Cabinet Key Decisions: ముగిసిన ఏపీ కేబినెట్‌.. కీలక నిర్ణయాలు ఆమోదం

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet Key Decisions: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్‌ సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది.. ముఖ్యంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.. కొత్త ఇసుక విధానానికి కేబినెట్ గ్నీన్‌ సిగ్నల్ ఇచ్చింది.. కొత్త ఇసుక పాలసీపై త్వరలో విధి విధానాలను రూపొందించనుంది ఏపీ ప్రభుత్వం.. మరోవైపు.. పౌర సరఫరాల శాఖ రూ. 2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం.. ఎన్సీడీసీ నుంచి రూ. 3200 కోట్ల రుణానికి వ్యవసాయ, సహకార కార్పొరేషన్లకు ప్రభుత్వ గ్యారెంటీకి కేబినెట్ పచ్చజెండా ఊపింది..

Read Also: CMF Buds Pro 2 Price: సూపర్ డిజైన్‌.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 43 గంటలు నాన్‌స్టాప్‌గా..!

ఇక, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఏపీ కేబినెట్‌ సమావేశంలో చర్చ జరగగా.. ఈ నెల 22వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది కేబినెట్‌.. అయితే, ఓటాన్ అకౌంట్ పెట్టాలా..? లేక ఆర్డినెన్స్ పెట్టాలా..? అనే అంశంపై కూడా కేబినెట్‌లో చర్చ సాగినట్టుగా తెలుస్తోంది.. ఇక, ఈ నెల 22వ తేదీ నుంచి మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే ఛాన్స్ ఉంది.. గవర్నర్ ప్రసంగంతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. కాగా, శ్వేత పత్రాలు ప్రస్తావనను అసెంబ్లీలో తేవాలని నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్‌.. కాగా, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వివిధ అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని, విద్యుత్‌ రంగం.. ఇలా వరుసగా నాలుగు శ్వేతపత్రాలు విడుదల చేస్తూ.. గత ప్రభుత్వంతో తీవ్రస్థాయిలో సీఎం చంద్రబాబు ధ్వజమెత్తిన విషయం విదితమే.