NTV Telugu Site icon

AP Budget 2023-24: అసెంబ్లీ వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టి బుగ్గన.. కేటాయింపులు ఇలా..

Ap Budget

Ap Budget

ఏపీ బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాలు నేడు కొనసాగుతున్నాయి. అయితే.. నేడు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి 2023-24 సంవత్సరానికి చెందిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే.. మంత్రి బుగ్గన రాజేంద్రానాథ్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతండగా టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. అంతేకాకుండా బడ్జెట్‌ కాపీలను స్పీకర్‌ పోడియం వద్దకు వచ్చి విసిరేశారు. దీంతో 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌ ఒక్కరోజు సస్పెండ్‌ చేశారు. ఇదిలా ఉంటే.. బడ్జెట్‌లో ఈ విధంగా కేటాయింపులు జరిగాయి. 2023-24 వార్షిక బడ్జెట్ 2 లక్షల 79వేల 279.17 కోట్లు అందులో.. రెవెన్యూ వ్యయం – 2,28,540 కోట్లు, మూల ధన వ్యయం – 31,061 కోట్లు, రెవెన్యూ లోటు – 22,316 కోట్లు. ద్రవ్య లోటు – 54,587 కోట్లు. జీఎస్డీపీ లో రెవిన్యూ లోటు – 3.77 శాతం. ద్రవ్య లోటు – 1.54 శాతం. బడ్జెట్ వ్యవసాయం -11,589 కోట్లు కాగా.. పశు సంవర్ధక శాఖ – 1787 కోట్లు, బీసీ సంక్షేమం- 23,509 కోట్లు, పర్యావరణం – 685 కోట్లు, ఉన్నత విద్య – 2065 కోట్లు, ఇంధన శాఖ – 6546 కోట్లు, మాధ్యమిక విద్యా – 29, 691కోట్లు, అగ్రవర్ణ పేదల సంక్షేమం – 11,085 కోట్లు, సివిల్ సప్లై – 3725 కోట్లు. ఆర్ధిక శాఖ -72, 424 కోట్లు కాగా.. జీఏడీ -1,148 కోట్లు, గ్రామ, వార్డు సచివాలయాలు -3,858కోట్లు, వైద్య, ఆరోగ్య శాఖ – 15,882 కోట్లు, హోం శాఖ -8, 206 కోట్లు, హౌసింగ్ -6292 కోట్లు, ఇరిగేషన్ -11,908 కోట్లు,
మౌలిక వసతులు, పెట్టుబడులు – 1295 కోట్లు. పరిశ్రమలు, వాణిజ్యం – 2602 కోట్లు. ఐటీ – 215 కోట్లు. కార్మిక శాఖ – 796 కోట్లు. న్యాయ శాఖ – 1058 కోట్లు. శాసన సభ సెక్రటేరియట్ – 111 కోట్లు. పట్టణాభివృద్ధి శాఖ – 9381 కోట్లు. మైనారిటీల సంక్షేమం -2240 కోట్లు. పబ్లిక్ ఎంటర్‌ ప్రైజెస్ -1.67 కోట్లు. ప్రణాళిక – 809 కోట్లు.

Also Read : AP-TS MLC Election: తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌..

పంచాయతీ రాజ్ శాఖ -15, 874కోట్లు. రెవెన్యూ – 5380 కోట్లు. రియల్ టైం గవర్నెస్ -73 కోట్లు. స్కిల్ డెవలప్మెంట్ -1167 కోట్లు. సాంఘిక సంక్షేమం – 14511 కోట్లు. ఆర్ అండ్ బి – 9119 కోట్లు. స్త్రీ శిశు సంక్షేమం – 3951 కోట్లు. యూత్, టూరిజం – 291 కోట్లు. డీబీటీ స్కీముల కోసం 54228.36 కోట్లు కేటాయింపు. పెన్షన్లు – 21434 కోట్లు. రైతు భరోసా – 4020కోట్లు. జగనన్న విద్యా దీవెన – 2842 కోట్లు. జగనన్న వసతి దీవెన -2200కోట్లు. వైఎస్సార్ పీఎమ్ బీమా యోజన – 700 కోట్లు. డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు -300 కోట్లు. రైతులకు వడ్డీ లేని రుణాలు – 500 కోట్లు. కాపు నేస్తం – 550 కోట్లు. జగనన్న చేదోడు – 350 కోట్లు, వాహన మిత్ర- 275 కోట్లు. నేతన్న నేస్తం -200 కోట్లు. మత్స్యకార భరోసా -125 కోట్లు. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడి 50 కోట్లు. రైతులకు నష్టపరిహారం – 20 కోట్లు. లా నేస్తం – 17 కోట్లు. జగనన్న తోడు -35 కోట్లు. ఈబీసీ నేస్తం – 610 కోట్లు. వైఎస్సార్ కళ్యాణ్ మస్తు -200 కోట్లు. వైఎస్సార్ ఆసరా – 6700కోట్లు, వైఎస్సార్ చేయూత -5000కోట్లు. అమ్మ ఒడి -6500 కోట్లు చొప్పున బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు.

Also Read : India Vs Australia ODI: విశాఖలో ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్.. ఫ్యాన్స్ ఎదురుచూపు

ధరల స్థిరీకరణ నిధి రూ.3,000 కోట్లు. వ్యవసాయ యాంత్రీకరణ రూ.1,212 కోట్లు. వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం రూ.15,882 కోట్లు. మన బడి నాడు-నేడు రూ.3,500 కోట్లు. జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు
పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ.15,873 కోట్లు. పురపాలక, పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రూ.1,166 కోట్లు. యువజన అభివృద్ధి, పర్యాటకం, సాంస్కృతిక శాఖ రూ.1,291 కోట్లు. షెడ్యూల్ కులాల కాంపొనెంట్ కోసం రూ.20,005 కోట్లు. షెడ్యూల్ తెగల కాంపొనెంట్ కోసం రూ.6,929 కోట్లు. వెనుకబడిన తరగతుల కాంపొనెంట్ కోసం రూ.38,605 కోట్లు. కాపు సంక్షేమం రూ.4,887 కోట్లు. మైనార్టీల సంక్షేమం రూ.4,203 కోట్లు.
పేదలు అందరికీ ఇళ్లు రూ.5,600 కోట్లు. పరిశ్రమలు, వాణిజ్యం రూ.2,602 కోట్లు. రోడ్లు, భవనాల శాఖకు రూ.9,118 కోట్లు. నీటి వనరుల అభివృద్ధికి (ఇరిగేషన్‌) రూ.11,908 కోట్లు. పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ రూ.685 కోట్లు. ఎనర్జీ రూ.6,456 కోట్లు. గ్రామ, వార్డు సచివాలయ శాఖకి రూ.3,858 కోట్లు. గడప గడపకు మన ప్రభుత్వం రూ.532 కోట్లు. 2023-2024 బడ్జెట్ అంచనా రూ.2,79,279 కోట్లు.

Show comments