NTV Telugu Site icon

AP BJP: ఏపీ బీజేపీలో కలవరం.. ఇంకా ఫైనల్ కానీ అభ్యర్థుల జాబితా..!

Bjp

Bjp

ఏపీ బీజేపీలో కలవరం కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు పలువురు ముఖ్య నేతలు ఢిల్లీలోనే మకాం వేశారు. ఇక, ఎన్డీఏ కూటమిలో ప్రధాన పక్షమైన టీడీపీ ఇప్పటికే మూడు విడతల్లో 139 అసెంబ్లీ, 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించగా.. జనసేన సైతం విడతల వారీగా 17 అసెంబ్లీ, కాకినాడ లోక్‌సభ స్థానానికి అభ్యర్థుల పేర్లను తెలియజేసింది. అయితే, ఇప్పటి వరకు బీజేపీ 4 విడతలుగా ప్రకటించిన జాబితాలో ఏపీ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

Read Also: Weather Department: నేటి నుంచి దంచికొట్టనున్న ఎండలు.. 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్

కానీ, ఏపీలో అభ్యర్థులను ప్రకటించడంతో బీజేపీ జాప్యం చేస్తుంది. 10 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక, బీజేపీలో టికెట్‌ ఆశిస్తోన్న అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పొత్తు కుదరక ముందే అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల నుంచి కమలం పార్టీ దరఖాస్తులు స్వీకరించింది. అలాగే, ప్రతి నియోజకవర్గం నుంచి ముగ్గురిని ఎంపిక చేసిన కాషాయం పార్టీ.. ఇప్పుడు అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోలేకపోతున్నారు. ఇవాళ్టి బీజేపీ అభ్యర్థులెవరో వెల్లడి కాకపోతే ఎలాగని బీజేపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చి తర్వాత ప్రతి నిమిషం విలువైందన్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ముఖ్యనేతలు ఏమీ చెప్పకుండా రోజుల తరబడి జాప్యం చేస్తుండటంతో పార్టీ కేడర్‌ సహనం కోల్పోతున్నారు. అయితే, పొత్తుల్లో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించినట్లు సమాచారం. కూటమి పార్టీ నేతల్లో వినిపిస్తున్న వివరాల ప్రకారం రాయలసీమలో 4, కోస్తాలో 3, ఉత్తరాంధ్రలో 3 సీట్లలో బీజేపీ బరిలో దిగబోతుంది.