AP BJP: రాష్ట్రంలో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలపై కూడా దృష్టి సారించింది. మంగళవారం నుంచి నామినేషన్లు ప్రారంభించనుంది. రేపటి నామినేషన్లకు కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలు హాజరవుతున్నట్లు ఏపీ బీజేపీ కార్యాలయం నుంచి కీలక ప్రకటన వెలువడింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు, ప్రచారాలు నిర్వహించనున్నారు. నరసాపురం లోక్ సభ స్థానం నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ బీజేపీ ఎన్నికల ఇంఛార్జి అరుణ్ సింగ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు పాల్గొంటారు.
READ MORE: Congress: ప్రధాని మోడీపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ యాదవ్ అనంతపురం జిల్లా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కు కేంద్ర మంత్రి వికే సింగ్ హాజరు కానున్నారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కైకలూరు అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనుండగా.. అక్కడికి కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ రానున్నారు. మాజీ ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణు కుమార్ రాజు విశాఖ నార్త్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనుండగా.. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహ రావు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
AP BJP: ఏపీకి రేపు కేంద్ర మంత్రుల రాక
Show comments