Site icon NTV Telugu

Ramoji Rao: తెలుగు భాషకు రామోజీ చేసిన సేవలు మరువలేనివి..

Ramoji

Ramoji

Ramoji Rao: తెలుగు భాషకు రామోజీరావు చేసిన సేవలు మరువలేనివి అని పేర్కొన్నారు బీజేపీ ఏపీ ఛీప్‌ దగ్గుబాటి పురంధేశ్వరి.. తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావుకి సంతాపం ప్రకటించిన ఆమె.. ఈనాడు అధినేత రామోజీ రావు లేరన్న వార్త తెలుగు జాతిని శోకసంద్రంలో ముంచిందన్నారు.. పాత్రికేయ రంగం పై చెరగని ముద్ర వేసిన ఈనాడు అధినేత రామోజీ రావు లేరనే వార్త ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోందన్నారు.. సినీరంగంలో కూడా ఎంతోమంది సామాన్య కళాకారులను పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి రామోజీరావు..ఈ విధంగా తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన రామోజీ రావు లేరన్న దుర్వార్త తెలుగు జాతిని శోకసంద్రంలో ముంచి వేసిందన్నారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు మరువలేనివి అని గుర్తుచేసుకుంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Read Also: Loksabha Elections 2024 : ఉత్తరప్రదేశ్‌లో ఇళ్లను వదలని ఓటర్లు.. 72స్థానాలపై తీవ్ర ప్రభావం

Exit mobile version