Site icon NTV Telugu

AP Bar Re-Notification: ఏపీలో మిగిలిపోయిన 432 బార్లకు రీ–నోటిఫికేషన్.. ఈనెల 15న లక్కీ డ్రా

Ap Bar Policy

Ap Bar Policy

AP Bar Re-Notification: ఏపీ ప్రభుత్వం కొత్త బార్ పాలసీ 2025–28లో భాగంగా మిగిలిపోయిన 432 బార్లకు ఎక్సైజ్ శాఖ రీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ 432 బార్లలో 428 ఓపెన్ కేటగిరీ బార్లు, 4 రిజర్వ్ కేటగిరీ గీతకుల బార్లు ఉన్నాయి. సెప్టెంబర్ 14, 2025 సాయంత్రం 6 గంటల వరకు ఉంది దరఖాస్తులు చేసుకోడానికి అవకాశం ఉంది. లక్కీ డ్రా సెప్టెంబర్ 15 ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్లు నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా చూస్తే గుంటూరు జిల్లా 67, విశాఖపట్నం 63, ఎన్టీఆర్ జిల్లా 61, నెల్లూరులో 33, పళ్నాడులో 30, తూర్పు గోదావరిలో 16 బార్లు రీ నోటిఫై అయ్యాయి. మిగతా జిల్లాల్లో అనకాపల్లి 2, అనంతపురం 9, కాకినాడ 12, కోనసీమ 9, శ్రీకాకుళం 14, విజయనగరం 15, పశ్చిమ గోదావరి 13 బార్లు సహా మొత్తం 432 బార్లు రీ నోటిఫై అయ్యాయి. మొత్తం జిల్లాల వారీగా ప్రత్యేకంగా డిస్ట్రిక్ట్ గెజిట్ నోటిఫికేషన్లు విడుదల అవుతాయి. వాటి ఆధారంగా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎంపిక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, SOP ప్రకారం నిర్వహించాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

READ ALSO: CM Revanth Reddy : వైఎస్సార్ స్ఫూర్తితోనే మా పాలన.. ఆయన ఆశయాలను కొనసాగిస్తాం

ఏపీ ప్రభుత్వం కొత్త బార్ పాలసీని ప్రకటించిన విషయం తెలిసిందే.. రాష్ట్రవ్యాప్తంగా ఓపెన్ కేటగిరీలో 840 బార్లు ఉన్నాయి.. వీటిలో 10 శాతం రిజర్వ్ కేటగిరీలో కల్లు గీత కార్మికులకు 84 బార్లు కేటాయించారు. బార్ల కేటాయింపును పారదర్శకత కోసం లాటరీ విధానం అమలు చేసింది ప్రభుత్వం.. 5 లక్షల ఫీజ్‌తో నాలుగు దరఖాస్తులు తప్పనిసరిగా ఇవ్వాలి అనే నిబంధన పెట్టారు.. దీంతో పాటు బార్ లకు సరఫరా చేసే మద్యంలో అదనంగా 15 శాతం రిటైల్ సుంకం చెల్లించాల్సి ఉంది.. దీని వల్ల ఒక్కో లైసెన్సి‌కి అదనంగా 30 లక్షలు భారం పడనుంది.. పర్మిట్ రూమ్‌లకు కూడా ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. 840 బార్లకు కేవలం 466 మాత్రమే దరఖాస్తులు పెట్టుకున్నారు.. మిగిలిన వాటికి ప్రభుత్వం తాజాగా రీ-నోటిఫికేషన్ జారీ చేసింది.

READ ALSO: Shehbaz Sharif: ఇండియా-రష్యా సంబంధాలపై పాక్ ప్రధాని కీలక కామెంట్స్..

Exit mobile version