NTV Telugu Site icon

AP Assembly: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

Ap Assembly

Ap Assembly

సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం పది గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో…ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా.. ఏపీ పదిహేనవ అసెంబ్లీకి ఇవే చివరి సమావేశాలు.

Arvind Kejriwal: “నన్ను బీజేపీలో చేరమని బలవంతం చేస్తున్నారు”.. కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు..

ఇదిలా ఉంటే.. నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యత దక్కని పలువురు వైసీపీ సిట్టింగుల్లో ఉత్కంఠ నెలకొంది. రాజ్యసభ ఎన్నికలు, అసంతృప్తులు, రెబల్ ఎమ్మెల్యేలతో లాబీ టాక్స్ ఆసక్తికరంగా మారనున్నాయి. మరోవైపు.. తమ పై వచ్చిన అనర్హత పిటిషన్ల పై స్పీకర్ కు లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వటానికి రేపే డెడ్ లైన్. కాగా.. నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి వివరణ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే ఆధారలతో సహా స్పీకర్ కు వివరణ ఇచ్చారు ఫిర్యాదుదారు, చీఫ్ విప్ ప్రసాద్ రాజు.

CM Revanth Reddy: 46 ఏళ్ల తరువాత కూడా చిరంజీవిలో అదే తపన.. మెగాస్టార్ పై రేవంత్..