NTV Telugu Site icon

AP Assembly 2025: 15వ రోజు అసెంబ్లీ సమావేశాలు.. ఎస్సీ వర్గీకరణపై నేడు తీర్మానం!

Ap Assembly 2024 4th Day

Ap Assembly 2024 4th Day

15వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. క్వశ్చన్ అవర్‌తో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆయకట్టు స్థిరీకరణ, తోటపల్లి ప్రాజెక్ట్ ఆధునికీకరణ, పోలీస్ కానిస్టేబుళ్ల భర్తీపై సభ్యులు ప్రశ్నించనున్నారు. ఎస్ఐలకు డిఎస్పీలుగా ప్రమోషన్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలపై ప్రశ్నలు అడగనున్నారు. ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ రిపోర్ట్.. మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి సభ ముందు ఉంచనున్నారు. ఎస్సీ వర్గీకరణపై ఇవాళ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేయనుంది. ఎస్సీ వర్గీకరణ అంశంపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది.

మరోవైపు ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానునాయి. సభలో వాడీ వేడిగా వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. అనుసూచిత కులాల ఉపవర్గీకరణపై ఏకసభ్య కమీషన్ నివేదికను మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రవేశపెట్టనున్నారు.

ఇవాళ మండలిలో ప్రశ్నోత్తరాలు:
# రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు
# రాష్ట్రంలో మినీ గోకులాలు
# ప్రభుత్వ ఆసుపత్రుల అధునికీకరణ
# క్రీడా పాఠశాలలు
# ఖర్చు లేని సేంద్రీయ వ్యవసాయం
# నూతన పరిశ్రమల స్థాపన
# గృహ నిర్మాణ పథకాలు
# విశాఖ జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్లు
# విశాఖలో సినీ పరిశ్రమ
# రాష్ట్రంలో దేవాలయాల నిర్వహణ