నేడు 6వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. గురువారం ఉదయం 9 గంటలకు శాసనసభ.. 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ఆరంభం కానున్నాయి. ఉభయ సభలు ప్రశ్నోత్తరాలతో ఆరంభమవుతాయి. ప్రతీరోజూ టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దాంతో శాసనసభ, శాసనమండలి సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఈరోజు కూడా సభ్యుల మధ్య వాడివేడిగా చర్చ కొనసాగే అవకాశం ఉంది.
ఏపీఎస్పీడీసీఎల్ 24వ వార్షిక నివేదిక ప్రతిని, 2013 కంపెనీల చట్టంలోని 395వ సెక్షను క్రింద ఆవశ్యకమైన విధంగా సభా సమక్షంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఉంచనున్నారు. 2020-2021 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ వాణిజ్య ప్రోత్సాహక సంస్థ లిమిటెడ్ యొక్క 52వ వార్షిక నివేదిక ప్రతిని, 2013 కంపెనీల చట్టంలోని సెక్షను 394 (1) క్రింద ఆవశ్యకమైన విధంగా సభా సమక్షంలో మంత్రి టీజీ భరత్ ఉంచనున్నారు. సాధారణ బడ్జెట్‌పై కూడా చర్చ జరగనుంది.
మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో చర్చించే అంశాలు:
# ఉద్యోగులకు కొత్త పీఆర్సీ, ఐఆర్
# పోలవరం డయాఫ్రం వాల్
# ప్రపంచ పెట్టుబడి సదస్సులో అవగాహన ఒప్పందాలు.
# విశ్వవిద్యాలయాలను పునరుజ్జీవింపజేయుట
# కళాశాల విద్యార్థుల ఆత్మహత్యలు
# అంగన్వాడీల గౌరవ వేతనాలు
# గ్రామ, వార్డు సచివాలయాలు
# రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు
# రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు
# రైతుల ఆత్మ హత్యలు
# గిరిజన ప్రాంతాల్లో రహదారులు నిర్మాణం