Site icon NTV Telugu

Nara Lokesh: మార్చిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే భాధ్యత మాది!

Nara Lokesh

Nara Lokesh

ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే భాధ్యత తమదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయలేదని, 1.82 లక్షల పోస్టులు గత టీడీపీ హయాంలోనే భర్తీ చేశాం అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో రెండోరోజు ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో డీఎస్సీ నోటిఫికేషన్, నిరుద్యోగ భృతిపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానాలు చెప్పారు.

‘గత ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. 1.82 లక్షల పోస్టులు గత టీడీపీ హయాంలోనే భర్తీ చేశాం. ఎట్టి పరిస్థితుల్లోను మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే భాధ్యత మాది. వాస్తవాలు తెలుసుకుని వైసీపీ సభ్యులు మాట్లాడాలి’ అని అన్నారు. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనుందని, ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. తల్లికి వందనం పథకానికి బడ్జెట్లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. తల్లికి వందనం పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.

Exit mobile version