Site icon NTV Telugu

AP Assembly: ఏపీ శాసనసభలో ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపు!

Ap Assembly Mla Seats

Ap Assembly Mla Seats

ఏపీ శాసనసభలో సభ్యులకు సీట్లను కేటాయించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు సూచనల మేరకు సీట్ల కేటాయింపు జరిగింది. సీనియారిటీ ప్రాతిపదికన శాసనసభలో ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయించారు. సీట్ విషయంలో ఏదైనా సందేహాలుంటే సిబ్బంది సహకారం తీసుకోవచ్చని ఎమ్మెల్యేలకు స్పీకర్ సూచించారు.

ట్రెజరీ బెంచ్‌గా ముందు వరుసలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు సీట్లను కేటాయించారు. అనంతరం చీఫ్ విప్, విప్‌లకు సీట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మాజీ సీఎం, వైసీపీ శాసనసభా పక్షనేత వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష బెంచిలో ముందు వరుస సీట్ కేటాయించారు. సీఎం చంద్రబాబుకు బ్లాక్ 1లోని సీట్ 1ను కేటాయించగా.. డిప్యూటీ సీఎం పవన్‌కు బ్లాక్ 2లో 39 సీట్‌ను నిర్ణయించారు. ఇక వైఎస్ జగన్‌కు బ్లాక్ 11లోని 202ను కేటాయించారు. అంటే స్పీకర్‌కు ఎడమ చేతి వైపు ఎదురుగా జగన్ సీట్ ఉండనుంది. అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు గతంలో కూర్చున్న స్థానంలో జగన్‌కు సీట్ కేటాయించారు.

ఏపీ శాసనసభలో బడ్జెట్ పై చర్చ ప్రారంభం అయింది. ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు చర్చ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ప్రస్తుతం అమలు జరుగుతున్న పథకాలు, బడ్జెట్ ప్రతిపాదనలను వివరించారు. ములధన వ్యయం.. నిధుల కేటాయింపు.. ఆర్ధిక పరిస్థితిపై చర్చ జరగనుంది. ఆర్ధిక మంత్రి కేటాయించిన ములధన వ్యయం ఆదాయం పెంచడానికి ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అన్నారు.

Exit mobile version