AP Assembly: గత ప్రభుత్వ హయాంలో జగన్‌ను సినీ ప్రముఖులు కలిసిన అంశంపై ఏపీ అంసెబ్లీలో మాటల యుద్ధం జరిగింది. కామినేని శ్రీనివాస్ vs మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. లా అండ్ ఆర్డర్‌పై మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. అపట్లో జగన్ ఇంటికి కొంత మంది సినీ ప్రముఖులు వచ్చారు. అప్పుడు జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వట్లేదని.. సినీ ఆటోగ్రఫీ మంత్రిగా ఉన్న పేర్ని నాని కలిసి చెప్పారు. నేను ఇంత మందిని తీసుకొస్తే ఆయన ఎందుకు రావడం లేదని చిరంజీవి చాలా గట్టిగా అడిగిన తరువాత జగన్ అపాయింట్‌మెంట్ ఇచ్చారని కామినేని చెప్పారు. అంటే చిరంజీవి హాల్‌లో కూర్చుని గట్టిగా మాట్లాడిన తరువాత జగన్ పై నుంచి కిందకు వచ్చి.. వాళ్లకు అపాయింట్‌మెంట్ ఇచ్చి వాళ్లతో మాట్లాడి.. వెనక్కి పంపించారని ఆయన ప్రస్తావించారు.
READ MORE: CDS Anil Chauhan: చైనా యుద్ధంలో ఎయిర్‌ఫోర్స్ దాడికి అప్పటి ప్రభుత్వం ఒప్పుకోలేదు..
ఇంతలో కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలను బాలకృష్ణ ఖండించారు. ఆయన అన్ని అసత్యాలు చెబుతున్నారని బాలకృష్ణ అన్నారు. చిరంజీవి గట్టిగా మాట్లాడటం వల్లే జగన్ అపాయింట్‌మెంట్ ఇచ్చారన్నది పచ్చి అబద్ధమన్నారు. “సైకోని ఇండస్ట్రీ నుంచి కొందరు కలవడానికి వెళ్లినప్పుడు చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ వచ్చారు అనడం అబద్ధం. గట్టిగా ఎవ్వరూ అడగలేదు. సినిమా ఇండస్ట్రీ మినిస్టర్‌ను కలవమన్నారు. చిరంజీవి గట్టిగా అడగడం వల్లే జగన్ వచ్చాడట.. అలా ఎవ్వరూ అడగలేదు.” అని బాలకృష్ణ స్పష్టం చేశారు.
READ MORE: UP Crime: పొరుగింటి వారి తప్పుడు లైంగిక వేధింపుల కేసు.. 6 పేజీల నోట్ రాసి వ్యక్తి ఆత్మహత్య..
