Site icon NTV Telugu

AP and Telangana Police: భారీ పేలుళ్లకు కుట్ర.. రిమాండ్‌ రిపోర్ట్‌లో విస్తుపోయే విషయాలు..

Isis Conspiracy

Isis Conspiracy

AP and Telangana Police: దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు ఐసీస్ చేసిన కుట్రను భగ్నం చేశారు తెలుగు రాష్ట్రాల పోలీసులు.. ఇద్దరు విద్యార్థులకు తమ వైపు తిప్పుకొని పేలుళ్లకు పక్కా స్కెచ్‌ వేశారు.. హైదరాబాద్‌కు చెందిన సమీర్, విజయనగరానికి చెందిన సిరాజ్‌లతో పేలుళ్లకు ప్లాన్ చేశారు.. ఐసీస్ ఉచ్చులో పడి హైదరాబాద్‌తో సహా పలు ప్రాంతాల్లో పేలుళ్లకు ప్లాన్ చేశారు యువకులు.. దీనికోసం ఆన్‌లైన్‌ ద్వారా పేలుడు పదార్థాలను కొనుగోలు చేశారు సిరాజ్‌, సమీర్‌.. ఈ నెల 21, 22వ తేదీల్లో విజయనగరంలో డమ్మీ ప్లాస్టిక్ ప్లాన్ చేశారు.. విదేశాల నుంచి వచ్చిన ఆదేశాలతో బాంబుల తయారు చేయడంపై దృష్టిపెట్టారు.. అయితే, బాంబుపేలుళ్లకు పాల్పడాలనుకున్న ఉగ్రవాదుల కుట్రను ఏపీ, తెలంగాణ పోలీసులు భగ్నం చేశారు.. విజయనగరానికి చెందిన సిరాజ్‌ , సికింద్రాబాద్‌ చెందిన సమీర్‌లను అరెస్ట్ చేశారు..

Read Also: నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ 10 షోలు ఇవే..!

సిరాజ్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉంటూ ఉగ్రవాదం వైపు ఆకర్షితుడైనట్టుగా పోలీసులు చెబుతున్నారు.. అల్‌ హింద్‌ ఇత్తేహాదుల్‌ ముస్లిమీన్‌ (అహిం) పేరిట సంస్థ ఏర్పాటు చేసి.. ఆ సంస్థకు సిరాజ్‌ నంబర్‌ వన్‌గా, సమీర్‌ నంబర్‌2 వ్యవహరించారు.. ఉగ్రవాద సంస్థ హ్యాండ్లర్‌.. ఉగ్రకుట్రల కోసం ఇద్దరికీ డైరెక్షన్ చేసినట్లుగా విచారణలో గుర్తించారు పోలీసులు.. సోషల్ మీడియా ద్వారా ఇద్దరితో కాంటెక్ట్ అయ్యారు హ్యాండ్లర్‌.. ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా ఇద్దరితో సంప్రదింపులు జరిపారట.. పేలుళ్లకు పథకరచన చేసి ఉగ్ర కార్యకలాపాల విస్తరణకు పన్నాగం వేశారు.. పొటాషియం క్లోరేట్, సల్ఫర్‌ తదితర పేలుడు రసాయనాలను ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసి.. ఆ పేలుడు పదార్థాల తయారీపైనా ఆన్‌లైన్‌లోనే అవగాహన పెంచుకున్నారు ఉగ్రవాదులు..

Read Also: Gulzar House : ఒకేసారి మూడు తరాలు అగ్నికి ఆహుతి.. హృదయవిదారకం..!

ఈ నెల 21 లేదా 22 తేదీల్లో విజయనగరం పరిసరాల్లో డమ్మీ బ్లాస్ట్‌కు స్కెచ్‌ వేశారు.. విజయనగర సమీపంలో డమ్మీ బ్లాస్ట్ కు ప్లాన్ చేశారు.. దీనిని పసిగట్టిన తెలుగు రాష్ట్రాల పోలీసులు.. పేలుళ్ల కుట్రను భగ్నంచేశారు.. నిందితులు మరికొందరు యువకులు, మైనర్లతోనూ తరచూ సమావేశాలు నిర్వహించినట్టుగా పోలీసులు చెబుతున్నారు.. గ్రూప్‌-2 సన్నద్ధత పేరిట హైదరాబాద్‌కు వచ్చిన సిరాజ్.. గ్రూప్‌-2 పరీక్ష రాసేందుకు విజయనగరం వెళ్లాడట.. సమాచారం అందడంతో నిఘా ఉంచిన తెలంగాణ ఇంటెలిజెన్స్‌ వర్గాలు.. ఏపీ పోలీసులను అప్రమత్తం చేశాయి.. దీంతో, సిరాజ్‌ ఇంటిపై దాడి చేసిన విజయనగరంలో పోలీసులు.. పేలుడు రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు.. అనంతరం ఇంటెలిజెన్స్‌ అధికారులు సికింద్రాబాద్‌లో సమీర్‌ను అరెస్ట్ చేశారు.. సమీర్ ను ట్రాన్సిట్‌ వారంట్‌పై విజయనగరం తరలించారు.. సిరాజ్‌ తండ్రి, సోదరులు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వహిస్తున్నారు.. కుటుంబం మొత్తం పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తుంటే సమీర్ మాత్రం ఉగ్రవాదం వైపు మళ్లడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.. ఇద్దరిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పర్చగా.. 14 రోజుల రిమాండ్‌ విధించింది కోర్టు..

Exit mobile version