Site icon NTV Telugu

Anushka Shetty: అనుష్క ‘ప్రమోషన్’ పంతం వీడనుందా?

Anushka Shetty Kathanar Movie,

Anushka Shetty Kathanar Movie,

టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి వెండితెరపై కనిపించి చాలా కాలమే అవుతోంది. ‘సైజ్ జీరో’ సినిమా కోసం ఆమె పడ్డ కష్టం, ఆ తర్వాత ఎదురైన ఆరోగ్య సమస్యలు (Weight issues) ఆమెను కెమెరా ముందుకు రావడానికి ఇబ్బంది పెడుతున్నాయనేది బహిరంగ రహస్యం. గత ఏడాది విడుదలైన ‘ఘాటీ’ సినిమా ప్రమోషన్లలో కూడా ఆమె కనీసం వీడియో కాల్‌లో కూడా కనిపించకుండా కేవలం వాయిస్ క్లిప్స్‌తో సరిపెట్టడం ఆమె ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది. అయితే, ఇప్పుడు వినిపిస్తున్న ఒక రూమర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Also Read : Kantara Part 3:రిషబ్ శెట్టి ఆ మాయా ప్రపంచానికి గుడ్ బై చెప్పేస్తున్నాడా?

అనుష్క తొలిసారి మలయాళంలో నటించిన పాన్-ఇండియా చిత్రం ‘కథనార్: ది వైల్డ్ సోర్సరర్’ (Kathanar: The Wild Sorcerer). జయసూర్య హీరోగా నటిస్తున్న ఈ ఫాంటసీ థ్రిల్లర్ ట్రైలర్ ఇటీవలే విడుదలై విజువల్స్ పరంగా వావ్ అనిపించింది. అయితే ఇందులో అనుష్కను ఒకటి రెండు షాట్స్‌కే పరిమితం చేయడంతో ఆమె రోల్ నిడివిపై సందేహాలు మొదలయ్యాయి. కానీ, చిత్ర బృందం మాత్రం అనుష్క ఈ సినిమా కోసం హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో జరిగే ప్రమోషన్లలో స్వయంగా పాల్గొంటుందని చెబుతోంది. ఇది ఆమె 50వ సినిమా కావడం, మలయాళంలో డెబ్యూ కావడంతో ఆమె ఈసారి మినహాయింపు ఇస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు.

మరోవైపు నెటిజన్లు మాత్రం, “స్ట్రయిట్ సినిమాలు చేసినప్పుడే రాని స్వీటీ, ఒక మలయాళ డబ్బింగ్ సినిమా కోసం వస్తుందా?” అని పెదవి విరుస్తున్నారు. మరి ఈ ఏడాది జూలై లేదా ఆగస్టులో విడుదల కానున్న ఈ సినిమా కోసం అనుష్క తన ఐదేళ్ల ‘ప్రమోషన్ బ్రేక్’ను చెరిపివేసి మీడియా ముందుకు వస్తుందో లేదో వేచి చూడాలి. ఒకవేళ అనుష్క నిజంగానే ప్రమోషన్లలో పాల్గొంటే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం!

Exit mobile version