Anushka Sharma Celebrations Goes Viral after Virat Kohli Claims Wicket: వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఆదివారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున 9 మంది బౌలర్లు బౌలింగ్ చేశారు. ప్రధాన బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆర్ జడేజాతో పాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ చేశారు. అయితే కింగ్ కోహ్లీ బౌలింగ్ చేయడమే కాదు.. వికెట్ కూడా పడగొట్టాడు. 9 ఏళ్ల తర్వాత కోహ్లీ ఖాతాలో వికెట్ పడింది. అంతకుముందు 2014లో వన్డేల్లో విరాట్ వికెట్ తీశాడు.
బెంగళూరులోని చిన్నస్వామి మైదానంలో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 3 ఓవర్లు బౌలింగ్ చేశాడు. తాను వేసిన 2వ ఓవర్‌లో డచ్ సారథి స్కాట్ ఎడ్వర్డ్స్ వికెట్ పడగొట్టాడు. 30 బంతులు ఎదుర్కొన్న ఎడ్వర్డ్స్ 17 పరుగులు మాత్రమే చేసి.. కేఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కోహ్లీ వికెట్ తీయగానే స్టాండ్స్‌లో మ్యాచ్ చూస్తున్న విరాట్ భార్య అనుష్క శర్మ పట్టరాని ఆనందంతో మురిసిపోయారు. లేచి నిలబడి నవ్వుతూ సంబరాలు చేసుకున్నారు.
స్కాట్ ఎడ్వర్డ్స్ వికెట్ తీసిన అనంతరం విరాట్ కోహ్లీ కంటే అనుష్క శర్మనే ఎక్కువగా సంబురాలు చేసుకున్నారు. అనుష్క సంబరాలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు వేసిన విరాట్ 13 రన్స్ ఇచ్చి.. 1 వికెట్ తీశాడు. వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీకి ఇదే తొలి వికెట్. వన్డేల్లో అతడికి ఇది ఐదో వికెట్. ఇదివరకు అలిస్టర్ కుక్, క్రెయిగ్ కీస్వెటర్, బ్రెండన్ మెకల్లమ్, క్వింటన్ డి కాక్‌ల వికెట్లు తీశాడు.
Also Read: Helicopter Crash: సముద్రంలో కుప్పకూలిన హెలికాప్టర్.. ఐదుగురు సైనికులు మృతి!
2023 వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ బౌలింగ్ చేయడం ఇది రెండోసారి. పూణెలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కేవలం 3 బంతులు మాత్రమే వేశాడు. గాయం కారణంగా ఓవర్ మధ్యలో హార్దిక్ పాండ్యా మైదానాన్ని వీడగా.. ఆ ఓవర్‌లో మిగిలిన 3 బంతులను కోహ్లీ వేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీకి వికెట్ దక్కలేదు.