NTV Telugu Site icon

Anupama: చెప్పినట్టుగానే ‘పరదా’ తొలగించుకు వస్తున్నా.. అనుపమ కీలక వ్యాఖ్యలు

Paradha

Paradha

Anupama Parameswaran, Darshana Rajendran Film Titled Paradha: తన తొలి సినిమా “సినిమా బండి”తో మంచి పేరు తెచ్చుకున్న ప్రవీణ్ కాండ్రేగుల ఇప్పుడు తన రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ ఈ సినిమాను నిర్మించారు. సమంత, రాజ్ & డీకే సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ మరియు కాన్సెప్ట్ వీడియోని ఆవిష్కరించారు. అనుపమ పరమేశ్వరన్, మలయాళ హీరోయిన్ దర్శన రాజేంద్రన్, సీనియర్ నటి సంగీత ముఖ్య పాత్రలలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ అనుపమ ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. పరదా లేకుండా అనుపమ కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాంప్రదాయ దుస్తులలో, అనుపమ ఓణీతో ముఖాన్ని కప్పి ఉంచే మరికొందరు అమ్మాయిలతో పాటు నిలబడి కనిపిస్తుంది.

Ponnam Prabhakar: కేసీఆర్ నియమించిన బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి

ఆమె గత సినిమాలోలా కాకుండా డి-గ్లామ్ పాత్రలో కనిపించనుంది. ఇక ఈ కాన్సెప్ట్ వీడియో గ్రామ సెటప్‌లో దేవత విగ్రహాన్ని చూపుతుంది. ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః.. శ్లోకం వినిపిస్తుంది. అంటే ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో, అక్కడ దైవత్వం వికసిస్తుంది మరియు స్త్రీలు ఎక్కడ అవమానించబడతారో, ఎంత శ్రేష్ఠమైనప్పటికీ అన్ని చర్యలు ఫలించవని అర్ధం. ఇక ఈ వీడియోని షేర్ చేస్తూ అనుపమ మునుపెన్నడూ లేని విధంగా కథలు, పాత్రలతో మీ ముందుకు వస్తాను అని చెప్పాకదా, బ్లాక్ బస్టర్ టిల్ స్క్వేర్ తర్వాత ఇప్పుడు ‘పరదా’తో రాబోతున్నా. మునుపెన్నడూ లేని అనుభవాన్ని మిగుల్చుకుంటానని వాగ్దానం చేస్తున్నా. మునుపెన్నడూ లేని విధంగా కథ చెబుతానని వాగ్దానం చేస్తున్నాను అంటూ ఆమె రాసుకొచ్చింది.

Show comments