NTV Telugu Site icon

NIA Raids: ఉగ్రవాదుల భారీ కుట్రను భగ్నం చేసిన ఎన్ఐఏ..

Nia

Nia

ఎన్ఐఏ అధికారులు ఇవాళ ఉదయం నుంచి తమిళనాడు, హైదరాబాద్ లో 22 చోట్ల సోదాలు చేసినట్లు తెలిపింది. ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల కోసం విస్తృత తనఖీలు చేసింది.. రెండు రాష్ట్రాల్లో 31 ప్రాంతాల్లో దాడులు చేయగా.. ఎన్ఐఏ అధికారులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మొబైల్ ఫోన్లు, లాప్ టాప్ లు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 60 లక్షల భారత కరెన్సీతో పాటు 18,200 అమెరికన్ డాలర్లను గుర్తించారు.

Read Also: Jabardasth Faima: పట్టుపట్టి సాధించింది.. తలెత్తుకునేలా చేసిన జబర్ధస్త్ ఫైమా

కోయంబత్తూర్‌లోని 22 చోట్ల , చెన్నైలోని 3 ప్రాంతాలు తమిళనాడులోని తెన్‌కాసి జిల్లాలోని కడైయనల్లూర్‌లో ఒక చోట ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ , సైబరాబాద్‌ పరిధిలో 5 చోట్ల సోదాలు చేయగా.. మదర్సాల ముసుగులో ఐఎస్ఐఎస్ భావజాలాన్ని ఐసీస్ నూరిపోస్తుంది. మహ్మద్ హసన్ అజహర్ సిద్దికీ, సయ్యద్ మురాబాతుద్దీన్, ఖాజా తమీజుద్దీన్, మహ్మద్ నూరుల్లా హుస్సేన్, సయ్యద్ అబ్దుల్ జబ్బార్ లను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Read Also: TS High Court: రంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై ఈ నెల 19 వరకు హైకోర్టు స్టే

దీంతో ఉగ్రవాదుల భారీ కుట్రను ఎన్ఐఏ అధికారులు భగ్నం చేశారు. ఈ సోదాల్లో కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు అరబిక్ భాషలో ఉన్న పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అరబిక్ క్లాసుల పేరుతో యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షితులను చేస్తున్నారు.. రీజనల్ స్టడీ సెంటర్ల పేరుతో ప్రత్యేక శిక్షణ.. సోషల్ మీడియా వాట్సప్ టెలిగ్రామ్ ల ద్వారా ప్రత్యేక శిక్షణ తరగతులు.. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కిలాఫత్ ఐడియాలజీని వ్యాప్తి చేసేందుకు ఉగ్రవాదుల కుట్ర చేస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఒక గ్రూపుగా ఏర్పడి స్థానిక యువతను ఉగ్రవాదులు తమ సంస్థలోకి చేర్చుకుంటున్నారు. గత సంవత్సరం అక్టోబర్ 23న కోయంబత్తూర్ లో కారు పేలుడు చర్యకు పాల్పడిన ఉగ్రవాదులు.. ఐసిస్ కార్యకలాపాలను విస్తరించాలనుకుంటున్న యువతను టార్గెట్ చేసుకొని ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు.

Show comments