Hyderabad: న్యూ ఇయర్ వేడుకలు అంటేనే జల్సాలు.. ఇక, హైదరాబాద్ లో ఒకటే సందడి ఉండబోతుంది. క్లబ్‌లు, పబ్‌లలో కేరింతలు, తుళ్లింతలతో హోరెత్తిపోతాయి. పార్టీల పేరుతో యువత మత్తులో ఊగిపోతుంది. దీంతో యువత వీక్ నెస్ ను క్యాస్ చేసుకునేందుకు డ్రగ్స్ మాఫియా రెడీ అయింది. ప్రతియేటా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కేంద్రంగా వందల కోట్ల రూపాయల డ్రగ్స్ దందా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడంతో.. యాంటి నార్కోటిక్స్ పోలీసులు ప్రత్యేకంగా నజర్ పెట్టారు. హైదరాబాదులోని పలు పబ్బులపై తనిఖీలు చేస్తున్నారు.
Read Also: Prajavani: మొదలైన ప్రజావాణి.. వినతులు స్వీకరిస్తున్న అధికారులు
అయితే, హైదరాబాద్ లోని పలు పబ్స్, క్లబ్స్ పై ఇప్పటికే పోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టారు. డ్రగ్స్ వినియోగం పబ్స్ లోనే అత్యధికంగా ఉంది.. ఈ డ్రగ్స్ అమ్మకాలకు అడ్డాలుగా మారిన పబ్స్ లో బడా బాబుల పిల్లలే టార్గెట్ గా పోలీసులు దృష్టి సారించారు. గోవా, బెంగళూర్, ముంబై నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ ను పెడ్లెర్స్ దిగుమతి చేస్తున్నారు. ఇక, పబ్స్ లో అనుమానిత పదార్థాలపై హైదరాబాద్ పోలీసులు సోదాలు చేస్తున్నారు. స్నిపర్ డాగ్స్ తో వాసన పరిశీలన చేసి డ్రగ్స్ ఆనవాళ్లు పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారు. డ్రగ్స్ స్పాట్ టెస్ట్ లకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. డ్రాగర్ డ్రగ్ టెస్ట్ కిట్స్ ను టీఎస్ఎన్ఏబీ తెప్పిస్తుంది. నోటి లాలాజలంతో డ్రగ్ టెస్ట్ లు స్పాట్ లో ఈ పరికరాలతో తేల్చనున్నారు. సినిమా ఇండస్ట్రీపైనా పోలీసులు గట్టి నిఘా పెట్టారు. నూతన సంవత్సర వేడుకలే టార్గెట్ గా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.