మహారాష్ట్రలో డ్రగ్ రాకెట్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గుట్టు రట్టు చేసింది. అంతర్రాష్ట్ర డ్రగ్స్ సిండికేట్‌ను ఎన్‌సీబీ ఛేదించింది. 32,000 మాత్రలు, 170 కిలోల దగ్గు సిరప్‌ను స్వాధీనం చేసుకుంది. 600 కిలోల కోడైన్ సిరప్, ఇతర మత్తు మందులను కూడా స్వాధీనం చేసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తుండగా పక్కా సమాచారంతో వల వేసి ఎన్‌సీబీ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Devendra Fadnavis: కసబ్ గురించి కాంగ్రెస్ ఆందోళన.. 26/11 దాడులపై రాజకీయం..
ఎన్‌సీబీ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ ఆధారంగా ఈ ఆపరేషన్ జరిగింది. మొదట పన్వెల్‌లోని ఒక నిల్వ ప్రదేశం నుంచి 12,400 ఆల్ప్రజోలం, 169.7 కిలోల కోడైన్ సిరప్‌ను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి సోదాల్లో థానేలోని ముంబ్రాలోని ఓ ఇంట్లో అదనంగా 9,600 ఆల్‌ప్రాజోలం, 10,380 నైట్రాజెపామ్ మాత్రలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నార్కోటిక్ డ్రగ్స్ ఇతర రాష్ట్రాల నుంచి ఇన్‌ల్యాండ్ పార్శిళ్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నట్లు ఎన్‌సీబీ అధికారులు అనుమానిస్తున్నారు. మే 4న TM షఫీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోగా.. ఈ గుట్టు రట్టైంది. థానేకు చెందిన ఓ ముఠా హస్తం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆపరేషన్ తర్వాత అక్రమంగా సేకరించిన అన్ని నిషిద్ధ వస్తువులు, షఫీ ఉపయోగించిన వాహనాలను NCB అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: ముద్రగడ పద్మనాభంను, ఆయన కుమార్తె క్రాంతిని కలుపుతా
