NTV Telugu Site icon

Anti Hijab Protest: అట్టుడుకున్న ఇరాన్.. భద్రతా దళాల కాల్పుల్లో 185మంది మృతి

Iran

Iran

Anti Hijab Protest: హిజాబ్‌ వ్యవహారంతో ఇరాన్ అట్టుడుకుతోంది. ఆందోళనల్లో ఇప్పటి వరకూ 185మంది మరణించినట్లు ఇరాన్ మానవహక్కుల సంఘం ప్రకటించింది. చనిపోయిన వారిలో 19మంది పిల్లలు ఉన్నట్లు తెలిపింది. హిజాబ్‌ సరిగా ధరించలేదన్న కారణంగా అరెస్టయి పోలీసులు కస్టడీలో మరణించిన మహ్సా అమిని ఉదంతంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Read Also: Gold Price: బంగారం కొనాలంటే ఇదే కరెక్ట్ టైం.. లేట్ అయితే కొనలేరు

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ సహా దేశ వ్యాప్తంగా వివిధ నగరాలు, పట్టణాల్లో ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మహిళలపై వివక్షాపూరిత చట్టాలను రద్దు చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నిరసనల్లో యువతీ యువకులతో పాటు పాఠశాల విద్యార్థినులు కూడా పాల్గొంటున్నారు.. కరాజ్‌ పట్టణంలో ఓ ప్రభుత్వాధికారికి వ్యతిరేకంగా సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేస్తూ వాటర్‌ బాటిల్స్‌ అతనిపై విసిరేశారు. ఇక ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ ఆస్తులకు నిరసనకారులు నిప్పుపెడుతున్నారు. ఆందోళనకారులను అదుపుచేయడానికి పోలీసులు టియర్‌గ్యాస్‌ ప్రయోగిస్తున్నారు. హదీస్‌ నజాఫీ అనే మరో యువతిని ఇరాన్‌ భద్రతా దళాలు కాల్చి చంపడంతో ఈ వివాదం మరింత వేడెక్కింది. దీంతో దేశ వ్యాప్తంగా హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు మరింత తీవ్రంగా కొనసాగుతూనే ఉన్నాయి.

Read Also: Amazon: అమెజాన్‎లో షాపింగ్‎తో ‘ఎక్స్ ట్రా హ్యపీనెస్’.. అదెలా అనుకుంటున్నారా..?

దాదాపు 20 మంది రివల్యూషనరీ గార్డులు, పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఆందోళనకారులు ప్రభుత్వ టీవీ ప్రసారాలను హ్యాక్‌ చేశారు. వార్తలు ప్రసారమవుతున్న సమయంలో దేశ అత్యున్నత నేత అయతుల్లా అలీ ఖమేనీ తలను టార్గెట్‌ చేస్తున్న చిత్రాలు టీవీ స్క్రీన్‌ మీద కనిపించాయి. ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీంరైసీ అల్-జహ్రా యూనివర్శిటీని సందర్శించినప్పుడు అక్కడి విద్యార్థినులు గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు.