Site icon NTV Telugu

Anshu Malika: పోస్ట్ వైరల్.. అమెరికాలో ఏపీ మాజీ మంత్రి కూతురికి అవార్డ్!

Anshu Malika

Anshu Malika

Anshu Malika: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రోజా కుమార్తె ‘అన్షు మాలిక’ తన అద్భుతమైన నైపుణ్యాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. చిన్నప్పటి నుంచే రచయిత్రిగా పలు పుస్తకాలను రాసి, అనేక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అన్షు, అక్కడ కూడా తన ప్రతిభతో ముందుకు దూసుకెళ్తున్నారు. అమెరికాలోని బ్లూమింగ్‌టన్‌లోని ఇండియానా యూనివర్శిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్స్ చదువుతున్న అన్షు మాలిక, ఇటీవల ప్రతిష్టాత్మకమైన “మౌరీన్ బిగ్గర్స్ అవార్డు 2025-26” ( Maureen Biggers Leadership Award)ను అందుకున్నారు. ఈ అవార్డును యూనివర్శిటీ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఉమెన్ అండ్ టెక్నాలజీ వ్యవస్థాపకురాలు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మౌరీన్ బిగ్గర్స్ పేరిట టెక్నాలజీ రంగంలో మహిళల సాధికారతకు కృషి చేస్తున్న వారికి అందిస్తారు. ఈ ఏడాది ఈ గౌరవం అన్షు మాలికకు దక్కింది.

IPhone 17 Blinkit: కేవలం 30 నిమిషాల్లో మీ చేతిలోకి ఐఫోన్ 17.. ఎలా అంటే?

వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలకు సాంకేతిక అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడం.. అలాగే నమీబియా, నైజీరియా, భారతదేశం వంటి దేశాలలో సాంకేతిక విద్యను ప్రోత్సహించడం కోసం కోడింగ్ శిబిరాలకు నాయకత్వం వహించడం, మహిళలకు వెబ్ డెవలప్మెంట్‌లో శిక్షణ ఇవ్వడం లాంటి అన్షు చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. సోషల్ మీడియా ద్వారా పేదలకు సాంకేతిక విద్యను అందించడంలో ఆమె చేసిన పరిశోధన, కృషి కూడా ఈ అవార్డుకు కారణమయ్యాయి. ఈ అవార్డు పొందిన విషయాన్ని, స్థానిక మీడియా తన గురించి రాసిన కథనాలను అన్షు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. ఇక అన్షు మాలిక సాధించిన అవార్డు నెటిజన్లు, అభిమానులు ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.

OTT : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఇంట్రస్టింగ్ సిరీస్ అండ్ సినిమాలు

Exit mobile version