NTV Telugu Site icon

Viswambhara : మెగాస్టార్ మూవీ లో మరో యంగ్ హీరోయిన్..

Ashika Ranganath

Ashika Ranganath

Viswambhara : మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ “విశ్వంభర”..ఈ సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ఠ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది.రీసెంట్ గా ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ వీడియో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Read Also :Gam Gam Ganesha : సెన్సార్ పూర్తి చేసుకున్న ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా’..

ఈ సినిమా షూటింగ్ జులై నెల చివరికల్లా పూర్తి చేసి ఈ సినిమా సీజీ, వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ కోసం మరింత సమయం తీసుకోని అద్భుతమైన క్వాలిటీ విజువల్స్ ప్రేక్షకులకు అందించనున్నారు.ఈ సినిమాను మేకర్స్ 2025 జనవరి 10న, సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.ఈ సినిమాలో చిరంజీవి పాత్ర ఎంతో భిన్నంగా ఉంటుందని సమాచారం.ఈ సినిమా కోసం దర్శకుడు వశిష్ఠ సరికొత్త లోకం సృష్టింనట్లు సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో యంగ్ హీరోయిన్ నటించబోతుంది.క్యూట్ బ్యూటీ అషికా రంగనాథ్ కు వెల్కమ్ చెబుతూ చిత్ర యూనిట్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.ఈ పోస్ట్ సోషల్ మిడిల్ బాగా వైరల్ అవుతుంది.