Site icon NTV Telugu

AP News: ఎన్నికల వేళ మరో ఉన్నతాధికారి బదిలీ..

Ec

Ec

ఏపీలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతుంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచారు. మరోవైపు.. రాష్ట్రంలో అధికారుల బదిలీలు కూడా జరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు పడింది. ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ డి. వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అతడిని ఎన్నికలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు కట్టబెట్టొద్దని, తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Read Also: BRS: ఈనెల 18న బీఆర్‌ఎస్‌ ముఖ్యనాయకుల సమావేశం..

ప్రత్యామ్నాయంగా మరో ముగ్గురి ఐఏఎస్‌ అధికారులు పేర్లు సిఫారసు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. మంగళవారం రాత్రి ఎనిమిది గంటల లోపూ ఈ ప్రక్రియ పూర్త చేయాలంది. ఇటీవల టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ. డి వాసుదేవ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. వైసీపీకి అనుకూలంగా ఉండే అధికారులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలంటూ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఈ విషయమై విజ్ఞప్తి చేశారు. బీజేపీ నేతలు అరుణ్ సింగ్, జీవీఎల్ నరసింహా రావు, టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్, జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఈసీని కలిసిన వారిలో ఉన్నారు.

Read Also: Sri RamaNavami 2024: రాముడి కల్యాణం తర్వాత పానకంనే ఎందుకు ఇస్తారు ?

Exit mobile version