NTV Telugu Site icon

Vande Bharat Train: మరోమారు వందేభారత్ రైలుపై రాళ్ల దాడి.. భయపడిపోయిన ప్రయాణికులు!

Vande Bharat Train

Vande Bharat Train

Vande Bharat Train: ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై గురువారం (అక్టోబర్ 3) రాళ్లదాడి జరిగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రైలుపై రాళ్లు రువ్వడం చేసారు. ఈ ఘటనలో రైలు కోచ్ కిటికీలు పగిలిపోయాయి. అయితే ప్రయాణికులెవరూ గాయపడలేదు. వారణాసి నుండి ఢిల్లీకి వెళ్తున్న రైలు నంబర్ 22435 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కాన్పూర్‌ లోని పంకీ స్టేషన్‌కు చేరుకున్నప్పుడు, కొంతమంది దానిపై రాళ్లు వేశారు.

Biggboss 8: మిడ్ వీక్ ఎలిమినేషన్.. అంతాకలిసి ఆదిత్య ఓంని పంపించారుగా

ఈ రాళ్లదాడి ఘటనతో కోచ్‌ లోని ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది. దీనిపై వెంటనే కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించారు. ఈ సంఘటన తర్వాత, రాళ్లదాడి చేసిన వారందరిపై పంకి ఆర్‌పిఎఫ్ కేసు నమోదు చేసి, విషయాన్ని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Italy: తప్పిన విమాన ప్రమాదం.. మంటలు చెలరేగగానే కిందకు దిగేసిన ప్రయాణికులు

బుధవారం (అక్టోబర్ 3) వందే భారత్ రైలు షెడ్యూల్ చేసిన సమయం కంటే కొంచెం ఆలస్యంగా బయలుదేరింది. ఈ రైలు రాత్రి 7 గంటల సమయంలో పంకీ స్టేషన్ ఔటర్ సిగ్నల్‌ లోకి ప్రవేశించిన వెంటనే, రైలులోని C-7 కోచ్‌పై రాళ్ల దాడి జరిగింది. తమను తాము రక్షించుకోవడానికి, చాలా మంది ప్రయాణికులు రాళ్ల భయంతో సీట్ల క్రింద దాక్కున్నారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Show comments