Site icon NTV Telugu

ప్రధాని మోడీకి మరో అరుదైన గౌరవం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అపూర్వ అవకాశం లభించింది. మరోసారి ఐక్యరాజ్య సమితి లో ప్రసంగించనున్నారు. సెప్టెంబర్‌ 25వ తేదీన ఐక్యరాజ్యసమితి అత్యున్నత జనరల్‌ అసెంబ్లీ సెషన్‌లో మాట్లాడనున్నారు. ప్రపంచ దేశాల్లో భారత్‌కు అగ్రభాగం లభిస్తోంది. ఈ క్రమంలోనే భారత ప్రధానిగా ఉన్న మోదీ ప్రసంగం కీలకం కానుంది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి వక్తల జాబితా సిద్ధం చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్షోభం, వైద్యారోగ్య సేవల్లో కొరత ఏర్పడిన నేపథ్యంలోనే 76వ వార్షికోత్సవ సమావేశం రానుంది. ఈ సమావేశాల్లో మొదటి రోజే ఉదయం ప్రధాని మోదీ ప్రసంగం ఉండడం విశేషం. ఐతే ఈ సమావేశం వర్చువల్ విధానంలో జరగనుంది.

Exit mobile version