NTV Telugu Site icon

Constable Murder Case: కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్.. మధ్యలో ఈమెవరు..?

Constable Murder Case

Constable Murder Case

Constable Murder Case: విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ రమేష్ మర్డర్ కేసులో మరో కొత్త ట్విస్ట్ వచ్చిచేరింది.. కొత్త వ్యక్తి పేరు వెలుగులోకి వచ్చింది. ఆమె ఎవరో కాదు శివాని పెద్దమ్మ కూతురు పైడమ్మ. పోలీసుల విచారణలో వెలుగులోకి సరికొత్త విషయాలు బయటపడ్డాయి. పైడమ్మే రామారావుతో కలవడానికి కారణమని శివాని పోలీసులకు తెలిపింది. ఫోన్ కాల్ డేటా పరిశీలించారు. వందల సార్లు కాల్స్ మాట్లాడినట్టు గుర్తించారు ఎంవీపీ పోలీసులు. పైడమ్మా, శివానీ, రామారావు ముగ్గురం కలిసే బయటకు వెళ్ళేవాళ్ళమని తెలిపిందామే. దీంతో శివానీని A4 గా చేర్చే అవకాశం ఉంది. మరోవైపు తనకు అసలు సంబంధం లేదంటుంది శివాని అక్క పైడమ్మ. కావాలనే ఇరికిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తుంది.

రామారావు ఒక ఫ్రెండ్ మాత్రమే అని చెప్పి పరిచయం చేసిందని చెబుతోంది పైడమ్మ. కాన్ఫరెన్స్ కాల్స్‌లో మాట్లాడినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో పైడమ్మను విచారిస్తున్నారు పోలీసులు. ఆమె ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఎంవీపీ పోలీసుల అదుపులోనే A1 భార్య శివానీ, A2 ప్రియుడు రామారావు, A3 నీలా.. ఉన్నారు. ఇవాళ వారిని రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. కాగా, కానిస్టేబుల్ రమేష్ హత్య కేసును విశాఖ పోలీసులు ఛేదించారు. ఆయన భార్య శివానిని హంతకురాలిగా నిర్ధారించారు. పోస్టుమార్టం రిపోర్టుతో రమేష్‌ది హత్యగా తేలిందన్నారు. ఊపిరి ఆడక చనిపోయినట్లు రిపోర్టు రావడంతో.. భార్యను విచారిస్తే నేరాన్ని అంగీకరించిందని తెలిపారు పోలీసులు. ఇక, పోలీసుల విచారణలో కొత్త కొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి..

Show comments