NTV Telugu Site icon

Bajaj Pulsar NS400Z : పల్సర్ నుంచి మరో కొత్త బైక్ వచ్చేసింది… లుక్ అదిరిపోయింది బాసూ…

Bajaj Pulsar Ns400

Bajaj Pulsar Ns400

ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఎప్పటికప్పుడు యూత్ ను ఆకట్టుకొనేలా కొత్త కొత్త బైకులను మార్కెట్ లోకి వదులుతుంది… ఇప్పటికే ఎన్నో బైకులు యూత్ నుంచి మంచి స్పందనను అందుకున్నాయి.. తాజాగా మరో కొత్త బైకును కంపెనీ మార్కెట్ లోకి లాంచ్ చేసింది.. బజాజ్ పల్సర్ NS400Z.. పల్సర్ బైకు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు యూత్ ఐకాన్ అనే చెప్పవచ్చు.. బజాజ్ కంపెనీ తాజాగా అడ్వాన్స్ వర్షన్ పల్సర్ బైకును మార్కెట్ లోకి వదిలింది.. ఆ బైకు ఫీచర్స్ మాములుగా లేవని వార్తలు వినిపిస్తున్నాయి.. బజాజ్ పల్సర్ తయారీ సంస్థ అప్ డేటెడ్ పల్సర్ NS400Z లాంచ్ చేసింది. ఇక ఆలస్యం ఎందుకు ఆ బైకు ఫీచర్స్, ధర ఎంతో ఒక లుక్ వేద్దాం పదండీ..

పల్సర్ N250 ఫీచర్స్..గతంలో చాలా బైకులను లాంచ్ చేసింది.. పాత కేటీఎమ్ 390 డ్యూక్, బజాజ్ డామినార్ 400 బైక్ లలో కనిపించి 373 సీసీ ఇంజిన్ ను కొత్త పల్సర్ ఎన్ఎస్ 400 జెడ్ లో ఏర్పాటు చేశారు. ఇది 39 హెచ్ బీ పవర్, 35 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఏర్పాటు చేశారు. టాప్ స్పీడ్ గంటలకు 154 కిలోమీటర్లు వరకు ఉంటుంది.. ఇప్పటికే సేల్ భారీగా జరిగినట్లు తెలుస్తుంది..

ఇక ధర విషయానికొస్తే.. ఈ కొత్త బైకు మూడు రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. లాంచింగ్ సమయంలో రెండు రంగులే ఇచ్చిన కూడా ఇప్పుడు మూడు రంగుల్లో వచ్చేశాయి.. ఎరుపు, నలుపు, తెలుపు లో బైక్స్ రిలీజ్ చేసింది బజాజ్. బ్లాక్ కలర్ బండికి మాత్రం యూఎస్ డీ ఫోర్క్స్ మీద..ఆన్‌లైన్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. కేవలం రూ. 5 వేలు డిపాజిట్‌ చెల్లించి వీటిని బుక్ చేసుకోవచ్చు. బజాజ్ సంస్థ విడుదల చేసిన కొత్త పల్సర్ ఎన్ఎస్ 400 హెచ్ వాహనం పల్సర్ శ్రేణిలో అత్యంత శక్తివంతమైన బైక్.. ఈ కొత్త బైకు షోరూం ధర వచ్చేసి రూ.1,85లక్షలుగా కంపెనీ నిర్ణయించారు..