Site icon NTV Telugu

Plane Fight: ఏమిరా బాబు ఎందుకంత ఆవేశం.. విమానంలో పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు

Flight Fight

Flight Fight

Plane Fight: విమానంలో ఇద్దరు ప్రయాణికులు పొట్టుపొట్టుగా కొట్టకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మామూలుగా కాదు.. ఓ వ్యక్తి ఏకంగా షర్ట్ విప్పేసి పక్క ప్రయాణికుడిపై పంచుల వర్షం కురిపించాడు. ఉన్నదే బక్కా పైగా ఎముకలన్నీ లెక్క పెట్టుకునేలా ఉన్నాయి. అయినా మనోడు ఎవరు ఆపినా ఆగకుండా పోరుకు సై అంటున్నాడు. ఎంతమంది పట్టుకున్న మనోడు ఆగట్లేదు. ఈ ఘటన బంగ్లాదేశ్ లో జరిగింది. ఆ దేశ జాతీయ విమానయాన సంస్థ బిమన్‌ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఈ కోట్లాట జరిగింది.

Read Also: Hrithik Roshan Birthday: సరైన సక్సెస్ కోసం హృతిక్ రోషన్ తపన!

ఆ సంస్థకు చెందిన బోయింగ్ 777 విమానం గాల్లో ఎగురుతుండగా ఇద్దరు ప్రయాణికులు ఘర్షణకు దిగారు. చొక్కా తీసేసి ఉన్న యువకుడు, పక్క సీటు వ్యక్తి మధ్య గొడవ జరిగింది. దీంతో పైకి లేచిన ఆ యువకుడు సీటులో కూర్చొని ఉన్న వ్యక్తిపై పంచ్‌లు ఇచ్చాడు. మరోవైపు సీటులో కూర్చొన్న వ్యక్తి కూడా యువకుడి చెంపపై కొట్టాడు. ఇంతలో తోటి విమాన ప్రయాణికులు, విమాన సిబ్బంది జోక్యం చేసుకున్నారు. వారిద్దనీ విడదీశారు. విమానంలోని కొందరు ప్రయాణికులు తమ మొబైల్‌ ఫోన్‌లో రికార్డ్‌ చేసిన వీడియో క్లిప్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Exit mobile version