మల్టీటాలెంటర్ రాశీ ఖన్నా థాంక్యూ తర్వాత టాలీవుడ్లో కనిపించలేదు. బాలీవుడ్, కోలీవుడ్ అంటూ తచ్చట్లాడుతోంది కానీ తెలుగు ప్రేక్షకులను పట్టించుకోవడం లేదు. నీరజా కోన దర్శకత్వంలో మూడేళ్ల తర్వాత తెలుసు కదాతో మళ్లీ టాలీవుడ్ కెరీర్ బూస్టప్ అవుతుందని గట్టిగానే నమ్ముతోంది ఈ ఢిల్లీ డాళ్.
Also Read : Kollywood : వరుస ప్లాప్స్.. రెమ్యునరేషన్ తగ్గించుకున్న స్టార్ హీరో
హిందీలో బిజీగా ఉన్న టైంలో ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఆఫర్ వచ్చింది రాశీకి. పవర్ స్టార్ సినిమా అనగానే కథ వినకుండా ఎగిరి గంతులేసి సెట్‌లో వాలిపోయానని చెప్పుకుంటున్న రాశీ ఖన్నా ఆనందానికి అవథుల్లేవు. ఇప్పటి వరకు తారక్ మినహా టైర్ 1 హీరోలతో జోడీ కట్టిన దాఖలాలు లేవు అమ్మడు. అందులోనూ మెగా హీరోతో వర్క్ అంటే ఆమెకు కలిసొస్తూ ఉంటుంది. సుప్రీమ్, తొలి ప్రేమ, ప్రతి రోజు పండుగ చిత్రాలు కమర్షియల్ హిట్స్‌గా నిలిచాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే మరో మెట్టు ఎక్కినట్లే భావిస్తోంది మేడమ్. అయితే మరో లక్కీ ఛాన్స్ రాశీని వెతుక్కుంటూ వచ్చిందన్నది లెటేస్ట్ బజ్. వాల్తేరు వీరయ్య కాంబో మళ్లీ రిపీట్ కాబోతోంది. మెగాస్టార్ చిరంజీవిని మరోసారి డీల్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొల్లగొట్టాడు బాబీ. కెవిఎన్ ప్రొడక్షన్స్ భారీగా తెరకెక్కించబోతుంది. మన శంకర్ వర ప్రసాద్ గారూ కంప్లీట్ అయ్యాక చిరు ఈ ప్రాజెక్టుకు షిఫ్ట్ కాబోతున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లను పరిశీలిస్తున్నాడట బాబీ. అందులో బెల్లం శ్రీదేవి అలియాస్ రాశీ ఖన్నాతో పాటు మాళవిక మోహనన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇదే నిజమేతే మేడమ్ పంట పండినట్లే.
