NTV Telugu Site icon

Vishwambhara : చిరంజీవి ‘విశ్వంభర’ లో నటించనున్న ఆ సీనియర్ హీరోయిన్..?

Whatsapp Image 2024 05 16 At 2.33.26 Pm

Whatsapp Image 2024 05 16 At 2.33.26 Pm

Vishwambhara: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. ఈ సినిమాను బింబిసార’ ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తున్నారు..ఈ సినిమా బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ త్రిష చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తుంది.చిరంజీవి,త్రిష కాంబినేషన్ లో దాదాపు 18 ఏళ్ల తరువాత ఈ బిగ్గెస్ట్ ఫాంటసీ మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్‌ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ , బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ సినిమాలో త్రిషతో పాటు మరో సీనియర్ హీరోయిన్ కూడా నటించబోతున్నట్లు సమాచారం.ఆ సీనియర్ హీరోయిన్ ఎవరో కాదు.. నటి ఖుష్బూ. అయితే ఈ సినిమాలో ఖుష్బూ పాత్ర కోసం మొదటగా సీనియర్ నటి విజయశాంతిని సంప్రదించగా ఆమెఒప్పుకోలేదని సమాచారం.దీనితో ఖుష్బూ ఓకే చెప్పినట్లు సమాచారం.త్వరలోనే చిత్ర యూనిట్ ఈ విషయంపై అధికారక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Show comments