Site icon NTV Telugu

Earthquake: టర్కీలో మరో భూకంపం..భయం గుప్పిట్లో ప్రజలు

Tu1

Tu1

టర్కీలో వరుస భూప్రకంపనలు ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. అతిపెద్ద భూకంపం సంభవించిన 12 గంటల్లోనే టర్కీ, సిరియాలో మరోసారి భూకంపం రావడం ఆందోళన కల్గిస్తోంది. ఇప్పటికే మొదటి భూకంపం బాధితుల సంఖ్య దాదాపు 16 వందలకు చేరగా..తాజాగా మరోసారి భూకంపం సంభవించింది. ఇది రిక్టారు స్కేలుపై 7.6గా నమోదైంది. ఎల్బిస్తాన్ జిల్లాలో సంభవించిన ఈ భూకంపాన్ని సిటీ డిజాస్టర్ ఎజెన్సీ ధ్రువీకరించింది. సోమవారం తెల్లవారుజామున వచ్చిన భూకంపం రిక్టారు స్కేలుపై 7.8గా నమోదైంది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికీ ఈ భూకంపం వల్ల టర్కీలో 912 మందికి పైగా మరణించగా..సిరియాలో మృతుల సంఖ్య 700కు చేరింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read: Prabhas: బిగ్ బ్రేకింగ్.. ప్రభాస్- కృతి సనన్ ఎంగేజ్ మెంట్..?

భూకంపం ధాటికి వేలాది భవనాలు నేలమట్టం కావడంతో టర్కీ, సిరియాలో కొన్ని ప్రాంతాల్లో భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. రోడ్లకు ఇరువైపులా కూలిపోయిన భవనాల శిథిలాలే దర్శనమిస్తున్నాయి. భూకంపం వల్ల ఇళ్లు కోల్పోయిన వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తమకు కావల్సిన వారిని కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయారు. 1939 తర్వాత దేశంలో ఇదే అతిపెద్ద విపత్తు అని, భూకంపంలో 2,818 భవనాలు నేలమట్టమయ్యాయని టర్కీ అధ్యక్షుడు రెకెప్ తయ్యిప్ ప్రకటించారు. ప్రపంచ దేశాలు టర్కీ, సిరియాకు సంఘీభావం ప్రకటించాయి. ఈ విపత్కర పరిస్థితిలో సాయం అందిస్తామనని చెప్పాయి. భారత్ కూడా తన వంతు సాయంగా ఎన్డీఆర్‌ఎఫ్ సహాయక బృందాలు, వైద్య బృందాలతో పాటు సహాయ సామగ్రిని టర్కీకి పంపింది.

Also Read: Brathuku Theruvu: ఏడు పదుల ‘బ్రతుకు తెరువు’!

టర్కీ, సిరియాలో సంభవించిన భారీ భూకంపం దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. భూకంపం ముందు ఓ వ్యక్తి తీసిన లైవ్ వీడియో వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. ముందుగా మెరుపులు వచ్చి ఆ తర్వాత ప్రకంపనలు రావడంతో విద్యుత్ సరఫరా స్తంభించిపోయి అంతా చీకటిమయం అయింది. ఆ తర్వాత క్షణాల్లోనే భూప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Exit mobile version