NTV Telugu Site icon

Pawan – Trivikram : పవర్ హౌజ్ కాంబో లోడింగ్?

New Project 2024 11 02t103649.974

New Project 2024 11 02t103649.974

Pawan – Trivikram : టాలీవుడ్‌లో ఉన్న డెడ్లీ కాంబినేషన్లలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ది కూడా ఒకటి. ఈ ఇద్దరు ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశారు. జల్సా, అత్తారింటికి దారేది సూపర్ హిట్ అవగా.. అజ్ఞాతవాసి ఫ్లాప్ అయింది. ప్రస్తుతం పవర్ స్టార్ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కమిట్ అయిన ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేసి.. ఆ తర్వాత పవన్ సినిమాలు చేస్తారనే గ్యారెంటీ అయితే లేదు. కాబట్టి.. పవర్ స్టార్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేం. కానీ నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ మాత్రం ఈ పవర్ హౌజ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుందనే చర్చకు దారి తీసింది. యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.. దుల్కర్ సల్మాన్‌ హీరోగా ‘లక్కీ భాస్కర్’ అనే సినిమా నిర్మించారు. దీపావళి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

Read Also:Sharad Pawar: తెల్లవారుజామునే శరద్‌ పవార్‌ ఇంటి ముందు బారులు తీరిన జనం..

దీంతో.. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో నాగవంశీ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ఏదైనా పొలిటికల్‌ డ్రామా చేస్తారా? అని అడగ్గా.. 2029 ఎన్నికల ముందు స్టార్‌ హీరోతో ఒక భారీ పొలిటికల్ సినిమా చేయాలని ఉందన్నాడు. పవన్, బాలకృష్ణతో చేస్తారా? అంటే, అది ఇప్పుడే చెప్పలేం అన్నాడు. ఇక్కడితో ఆ పొలిటికల్ ఫిల్మ్ ఎవరితో చేస్తారనే చర్చ మొదలైంది. బాలయ్యతో డౌటే కానీ, పవన్‌తో మాత్రం ఈ ప్రాజెక్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే.. త్రివిక్రమ్, పవన్ బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ, త్రివిక్రమ్ ఫ్యామిలీ మెంబర్. కాబట్టి.. ఖచ్చితంగా 2029 ఎన్నికలు టార్గెట్‌గా పవర్ స్టార్‌తో త్రివిక్రమ్ ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందనే టాక్ మొదలైంది. ఈలోపు త్రివిక్రమ్.. అల్లు అర్జున్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ లిస్ట్‌లో చేరనున్నారు. కాబట్టి.. 2029 ఎలక్షన్స్‌కు ముందు ఈ కాంబో సునామీ సృష్టించడం గ్యారెంటీ.

Read Also:Paragliding World Cup: నేటి నుంచే పారాగ్లైడింగ్ ప్రపంచకప్.. 32 దేశాల నుండి ఆటగాళ్లు

Show comments