Paragliding World Cup: నేటి నుంచే పారాగ్లైడింగ్ ప్రపంచకప్.. 32 దేశాల నుండి ఆటగాళ్లు
- హిమాచల్ ప్రదేశ్‌లోని బీడ్ బిల్లింగ్ వ్యాలీలో.
- పారాగ్లైడింగ్ ప్రపంచకప్..
- 32 దేశాల నుండి ఆటగాళ్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paragliding World Cup 2024: హిమాచల్ ప్రదేశ్‌లోని బీడ్ బిల్లింగ్ వ్యాలీలో నేటి (శనివారం) నుంచి పారాగ్లైడింగ్ ప్రపంచకప్ రెండోసారి నిర్వహించనున్నారు. పారాగ్లైడింగ్ ప్రపంచకప్ నవంబర్ 2 నుంచి 9 వరకు జరగనుంది. శనివారం ఉదయం 11 గంటలకు హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ ఆర్‌ఎస్ బాలి టేకాఫ్ సైట్ బిల్లింగ్‌లో హవన్ యాగం తర్వాత ప్రారంభోత్సవం చేస్తారు. 32 దేశాల నుంచి దాదాపు 100 మంది ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటారు. పాల్గొనేవారి తుది జాబితాను శనివారం ఉదయం విడుదల చేస్తారు. దీని తరువాత, పాల్గొనేవారికి బిల్లింగ్ ఆకాశం నుండి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబడుతుంది.
Read Also: Karthika Masam 2024: నేటి నుంచి కార్తీక మాసం.. శివాలయాలకు పోటెత్తిన భక్తజనం..
Also Read
- Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
మొదటి రోజు ట్రయల్ టాస్క్‌లు మాత్రమే ఉంటాయి. బిల్లింగ్ పారాగ్లైడింగ్ అసోసియేషన్ (బీపీఏ) ప్రెసిడెంట్ అనురాగ్ శర్మ మాట్లాడుతూ.. 2015 తర్వాత రెండోసారి ప్రపంచకప్ బిల్లింగ్‌లో జరగబోతోంది. భారతదేశంలో పారాగ్లైడింగ్ ప్రపంచ కప్ బిల్లింగ్‌లో మాత్రమే నిర్వహించబడింది. ఇప్పటికే పారాగ్లైడింగ్ వరల్డ్ కప్ అధికారులు బీడ్ చేరుకున్నారు. పాల్గొనే వారందరికీ ప్రతిరోజూ ప్రయాణించడానికి ఒక టాస్క్ ఇవ్వబడుతుందని, దీని దూరం 50 నుండి 130 కిలోమీటర్ల వరకు ఉంటుందని తెలిపారు. పాల్గొనేవారి భద్రత కోసం రెస్క్యూ, సెక్యూరిటీ టీమ్‌లు ఉంటాయని.. అంతే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు. శనివారం సాయంత్రం ల్యాండింగ్ సైట్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి.
ప్రపంచ కప్‌ను పారాగ్లైడింగ్ వరల్డ్ కప్ అసోసియేషన్ (PWCA) గుర్తించింది. అలాగే ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్ (FAI) ద్వారా కేటగిరీ 2 ఈవెంట్‌గా రేట్ చేయబడింది. ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని గుర్తించింది. అమెరికా, ఇంగ్లాండ్, చైనా, భారతదేశం, రష్యా, నెదర్లాండ్స్, కొరియా, మలేషియా, బ్రెజిల్, సింగపూర్, ఫ్రాన్స్, వియత్నాం, కజకిస్తాన్, పోలాండ్, ఇరాన్, హంగరీ, తైపీ, నేపాల్, ఇజ్రాయెల్ ఇంకా బంగ్లాదేశ్‌తో సహా ఇతర దేశాల నుండి పాల్గొనేవారు ప్రపంచ కప్‌లో పాల్గొంటారు. వీక్షకుల కోసం వైమానిక సాహస క్రీడలు, మారథాన్, సైక్లింగ్‌కు సంబంధించిన అనేక విన్యాసాలు కూడా నిర్వహించబడతాయి.
తాజావార్తలు
-
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
-
Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
-
Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
-
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?