NTV Telugu Site icon

NTR: తారక్ హ్యాండ్ పడితే.. ‘అన్ని మంచి శకునములే’

Ntr

Ntr

NTR: ఎన్టీఆర్.. ప్రస్తుతం ఎన్టీఆర్ 30 తో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాల విషయం పక్కన పెడితే.. ఇండస్ట్రీలో అన్ని సినిమాలు హిట్ అందుకొని.. బాక్సాఫీస్ కళకళలాడాలి అనుకునే హీరోల్లో తారక్ ఒకడు. దీనికోసం తారక్ ఎప్పుడు కుర్ర హీరోలకు సపోర్ట్ గా నిలుస్తాడు. ఇక ఇండస్ట్రీలో తారక్ సపోర్ట్ చేసిన సినిమాలు చాలా హిట్ అందుకున్నాయి. బింబిసార, ధమ్కీ, విరూపాక్ష.. ఇలా మంచి హిట్లు అందుకోవడంతో కుర్ర హీరోలు సైతం తారక్ ను సహాయం అడుగుతున్నారు. ఇక ఆ హీరోల్లో కుర్ర హీరో సంతోష్ శోభన్ కూడా చేరిపోయాడు. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అన్ని మంచి శకునములే. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో స్వప్న దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కు మేకర్స్ ముహూర్తం తో పాటు మంచి హ్యాండ్ ను కూడా ఎన్నుకున్నారు. తారక్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మే 12 వ తేదీ సాయంత్రం 5 గంటలకు అన్ని మంచి శకునములే ట్రైలర్ తారక్ రిలీజ్ చేస్తున్నట్లు చెప్పుకొస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. “ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసిన మనకు అన్నీ మంచి శకునములే.. మా తారక రాముడికి చేరిన చల్లని చిరుగాలి” అంటూ ఎన్టీఆర్ మ్యాషప్ వీడియోను పంచుకున్నారు. ఇక ఈ వీడియో చూసాకా..తారక్ హ్యాండ్ పడితే..నిజంగా మంచి శకునములే .. సంతోష్ హిట్ అందుకున్నట్లే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా మే 18 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Show comments