Site icon NTV Telugu

Annapoorani :అన్నపూర్ణి సక్సెస్.. సెలబ్రేషన్స్ లో నయనతార..

Whatsapp Image 2023 12 05 At 11.54.06 Am

Whatsapp Image 2023 12 05 At 11.54.06 Am

లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస సినిమాల చేస్తూ దూసుకుపోతుంది.ఈ భామ సినిమాలతో పాటు వెబ్ మూవీస్ కూడా చేస్తూ బీజీ అయిపోయింది.ప్రస్తుతం ఈ భామ సినిమాకు ఏకంగా 15కోట్ల వరకు పారితోషకం తీసుకుంటూ టాప్ లో కోనసాగుతోంది. నయనతార తాజాగా నటించిన మూవీ అన్నపూర్ణి..ఈ సినిమా నయన్ కెరీర్‌లో 75వ సినిమాగా తెరకెక్కింది . ఈ చిత్రాన్ని నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఎస్. ఆర్.రవీంద్రన్ సమర్పణలో, నాస్ స్టూడియోస్ -ట్రైడెంట్ ఆర్ట్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.ఎన్నో కట్టుబాట్ల మధ్య పెరిగిన ఒక బ్రహ్మణ యువతి చెఫ్ గా మారాలి అనుకుంటే ఆమెకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి. నాన్ వేజ్ వండాల్సి వచ్చినప్పుడు తాను ఎంత ఇబ్బంది పడింది. తన కుటుంబం నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకుని దేశంలో బెస్ట్ చెఫ్ గా ఎలా ఎదిగింది అనేది ఈ సినిమా కథ. ఇక మూవీలో జై, సత్యరాజ్, అచ్యుత్ కుమార్, కెఎస్ రవికుమార్ మరియు సురేష్ చక్రవర్తి సహా పలువురు నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించాడు.

డిసెంబర్ 01న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తమిళనాట మంచి టాక్ తో దూసుకుపోతుంది.. ఇక ఈమూవీ సక్సెస్ అవ్వడంతో మూవీ టీమ్ అంతా సెలబ్రేషన్స్ చేసుకున్నారు.మూవీ టీం చెన్నైలోని ఓ లేడీస్ కాలేజిని సందర్శించి అక్కడే ఈ మూవీ సెలబ్రేషన్స్ ను జరిపారు. కాలేజీని సందర్శించిన వారిలో హీరోయిన్ నయనతారతో పాటు హీరో జై కూడా ఉన్నారు. వీరు కాలేజీకి రావడంతో అక్కడ స్టూడెంట్స్ అంతా ఆనందంతో కేరింతలు కొట్టారు. సెలబ్రిటీస్ ను చూడటానికి స్టూడెంట్స్ ఎంతగానో పోటీ పడ్డారు.ఈక్రమంలో నయనతార మరియు చిత్ర యూనిట్ అక్కడే లంచ్ చేశారు.. నయనతార మరియు హీరో జై లంచ్‌ టైమ్‌లో స్టూడెంట్స్‌తో ముచ్చటించారు. నయన్ వారికీ స్వయంగా బిర్యానీ వడ్డించారు.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇదిలా ఉంటే ఈమూవీ ఈనెల 31న ఈసినిమా జీ5 లో స్ట్రీమింగ్ అవ్వబోతోంది.

https://twitter.com/zeestudiossouth/status/1731290335052288324

Exit mobile version