Road Accident: అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 9కి చేరిన మృతుల సంఖ్య!
- అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- 9కి చేరిన మృతుల సంఖ్య
- అతివేగమే ప్రమాదానికి కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. ప్రమాదంలో ఐదు మంది మహిళలు, నలుగురు పురుషులు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నేడు తొమ్మిది మంది మృతదేహాలకు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మృతులు అందరూ రైల్వే కోడూరు మండలం సెట్టిగుంట ఎస్టీ కాలనీ చెందిన వారిగా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.
రాజంపేట నుంచి రైల్వేకోడూరు మార్కెట్‌కు మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ.. ఆదివారం రాత్రి పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. ప్రమాద సమయంలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు చిన్న పిల్లలతో కలిపి లారీలో 21 మంది కూలీలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి 9 మందిని రక్షించారు.
Also Read
- AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
- CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్‌లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
- Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
- Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
ఈ రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. ‘లారీ బోల్తా పడి 9 మంది మృతి చెందడం బాధాకరం. మామిడికాయలు కోసే కూలీల మరణ వార్త దిగ్బ్రాంతికి గురి చేసింది. కూలీల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అని అన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా సమగ్ర భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
తాజావార్తలు
-
Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్‌పైనే!
-
Yashasvi Jaiswal-ICC: శ్రీలంక పేసర్‌తో గొడవ.. యశస్వి జైస్వాల్‌కు ఐసీసీ బిగ్ షాక్!
-
Prasanth Varma: అసలు ప్రశాంత్ వర్మ ప్లానేంటబ్బా?
-
Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్‌కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
-
Raaka: ‘రాకా’లో ఐదో బ్యూటీ.. అట్లీ గారు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారండి!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!