NTV Telugu Site icon

Annamayya Project: ఇక చకచకా అన్నమయ్య ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనులు

Annamayya

Annamayya

అన్నమయ్య ప్రాజెక్టు టెండర్లు ఖరారు కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంఖుస్థాపన కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో వరదల్లో కొట్టుకు పోయిన అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణానికి సంబంధించిన టెండర్లను జలవనరులశాఖ ఖరారు చేసింది. రివర్స్‌ టెండరింగ్‌లో 3.94 శాతం ఎక్సెస్‌కు కోట్‌ చేసిన 2014లో ఖమ్మం నుంచి వైకాపా ఎంపీగా గెలుపొందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ దక్కించుకుంది. కడప నీటి పారు దలశాఖ ఎస్‌ఈ శ్రీనివాసులు ఫైనాన్షియల్‌ బిడ్‌ను ఓపెన్‌ చేశారు.

Read Also: Horrible Accident : ఆగి ఉన్న బస్సులను ఢీకొన్న ట్రక్కు.. 8మంది మృతి

అందులో 4.99 శాతం ఎక్సెస్‌కు టెండర్‌ కోట్‌ చేశారు. అనంతరం రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించగా 3.94 శాతానికి సీఈ కె.హరినాధ్‌రెడ్డి టెండరును ఖరారు చేశారు. టెండరు ఒప్పందం చేసుకున్న రోజు నుంచి రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. పునర్నిర్మాణ అంచనా వ్యయం రూ.635 కోట్లు కాగా.. టెండరు ఎక్సెస్‌ రేట్లు మేరకు ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.660.23 కోట్లు కానుంది. ప్రాజెక్టుకు ఏప్రిల్‌ 5న సీఎం జగన్‌తో శంకుస్థాపన చేయించాలని ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి భావిస్తున్నారు. ఒంటిమిట్ట సీతారాముల కల్యాణోత్స వానికి సీఎం జగన్‌ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడానికి రానున్నారు.

ఈ సందర్భంగా శంఖుస్థాపన కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నారు. అ­ధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అన్నమయ్య జిల్లా­లో రాజంపేట మండలంలోని బాదనగడ్డ వద్ద చె­య్యే­రుపై దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును 2.24 టీఎంసీల సామర్థ్యంతో పునరుద్ధరించేలా పనులను కాంట్రా­క్టు సంస్థ చేపడు తుంది. చెయ్యేరుకు భారీ వరద వచ్చినా చెక్కు చెదరకుండా నిలబడేలా అ­ధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అన్నమయ్య ప్రా­­జెక్టు పునరుద్ధరణ పనులను ప్రభుత్వం చేపట్టనుంది.

Read Also: Kondagattu Chori: కొండగట్టు చోరీ కేసు.. దొంగలు ఆలయంలో ఎలా వెళ్లారంటే..