Anna Lezhneva: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నెవా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో సందడి చేశారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్లో నెటిజన్లు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు ఆమె ఓపిగ్గా సమాధానాలిచ్చారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌తో తన ప్రేమ, వ్యక్తిగత విషయాల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఇంటరాక్షన్ లో ఒక అభిమాని.. “మీ ఇద్దరిలో మొదటగా ఎవరు ప్రపోజ్ చేశారు? పవన్ కళ్యాణ్ గారే ఫస్ట్ ప్రపోజ్ చేశారా?” అని అడగ్గా.. దీనికి అన్నా లెజ్నెవా స్పందిస్తూ.. “అవును, ఆయనే (పవన్) మొదటగా ప్రపోజ్ చేశారు” అని సమాధానమిచ్చారు. దీంతో పవర్ స్టార్ లవ్ స్టోరీపై క్లారిటీ రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. భాషల గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తనకు మొత్తం 6 భాషలు వచ్చని ఆమె వెల్లడించారు. అయితే కమ్యూనికేషన్ కోసం తాను ఇంగ్లీష్ భాషలో మాట్లాడటానికే ఎక్కువగా మొగ్గు చూపుతానని చెప్పారు. ఇక తెలుగు గురించి మాట్లాడుతూ.. “నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్నాను” అని చెప్పుకొచ్చారు. వంటల గురించి అడిగిన ప్రశ్నలకు అన్నా లెజ్నెవా సమాధానం ఇస్తూ.. “నేను మా అత్తమ్మ (పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి) దగ్గరే చాలా వంటలు నేర్చుకున్నాను. ఇప్పుడు నేను దోస, ఇడ్లీ, చట్నీలతో పాటు పప్పులు, కూరలు కూడా చేయగలను” అని చెప్పారు. కేవలం టిఫిన్లే కాకుండా గోంగూర, పాలక్ పన్నీర్, బిర్యానీ, చేపల పులుసు వంటి ఘుమఘుమలాడే వంటకాలను కూడా తాను స్వయంగా వండగలనని ఆమె వెల్లడించారు. ముఖ్యంగా శాకాహార వంటకాలపై తనకు పట్టు ఉందన్నారు.
ఇక పవర్ స్టార్‌కు ఏ వంట అంటే ఇష్టమనే ప్రశ్నకు అన్నా లెజ్నెవా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. “పవన్ గారికి మా అత్తమ్మ చేసే మసాలా చికెన్ కూర అంటే అమితమైన ఇష్టం. ఆ రెసిపీని కూడా నేను అత్తమ్మ దగ్గరే నేర్చుకున్నాను” అని చెప్పారు. అలాగే సురేఖమ్మ చేసే చేపల పులుసు అంటే కూడా పవన్ ఎంతో ఇష్టంగా తింటారని ఆమె పేర్కొన్నారు.
READ ALSO: Junior NTR : ఎక్స్‌ను షేక్ చేస్తున్న ఎన్టీఆర్ ట్వీట్.. ‘బావా’ అంటూ స్పెషల్ పోస్ట్!