NTV Telugu Site icon

Anjeer Fruit Cultivation: అంజీరా పండ్ల సాగులో తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Anjeera

Anjeera

అంజీరా పండ్లకు మంచి డిమాండ్ ఉంది.. వీటిలో పోషక విలువలు ఎక్కువగా ఉండటంతో వీటికి రోజు రోజుకు ధరలు పెరుగుతూనే ఉన్నాయి.. ఇక రైతులు కూడా వీటిని పందించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు..ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా ఆంజీరాలు ఉన్నట్టు అంచనా.. మరి ఇందులో ఎలాంటి ఉపాది ఆవకాశాలు ఉన్నాయి.. చెట్టు నుండి తీసిన పండులో ఎలాంటి ఉత్పత్తులు తయారుచేయవచ్చో అనేవి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం..

ఈ ఆంజీరను ఆరోగ్య ప్రధాయినిగా గుర్తించింది.. ఇటీవల కాలంలో మనదేశంలో అంజీరను వాణిజ్యపంటగా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడులో వాణిజ్య పంటగా విస్తారంగా సాగుచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో 5వేల ఎకరాలలో అంజీరా సాగు ఆవుతుందని అంచనా.. అంజీరా చెట్టు నాటిన 9 నెలలు నుండి 15 సంవత్సరాలు వరకు పండ్లను ఇస్తుంది.. ఒక్కొక్క చెట్టు నుండి 20 కేజీలు నుండి 60 కేజీలు వరకు దిగుబడిని ఇస్తుంది..

మేలైన రకాలు..

అంజూర పండు ఆవిర్భవించిన వెంటనే చూసేటటువంటి పుష్పగుచ్ఛం పెద్ద సంఖ్యను కలిగి ఉంటుంది. లోపలి వైపు పువ్వులు. అత్తి పండు యొక్క శిఖరం వద్ద ఒక కన్ను అని పిలువబడే ఒక చిన్న ద్వారం ఉంది, ఇది సాధారణంగా బ్రాక్ట్‌లతో కప్పబడి ఉంటుంది- పూనా, కొనార్డియా, మిషన్ కడోటా, బ్రౌన్ టర్కీ. కాలిమిర్నా.. ఈ పంటను వర్షాకాలంలో జూన్ నుండి అక్టోబర్ వరకు 6 మీటర్ల అంతరంలో తయారు చేసిన చతురస్రాకార పద్ధతిలో 60 సెం.మీ క్యూబ్ గుంతలలో నాటడం జరుగుతుంది. స్థలం నుండి ప్రదేశానికి, నేల నుండి నేల, వివిధ రకాలుగా మారుతూ ఉంటుంది..

ఈ అంజీరా పంట గురించి తెలుసుకొని రైతులు పంట వేసుకోవడం మంచిది..అంజీర పండులో ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది.. జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఎసిడిటి, మలబద్దకాన్ని నిరోధించి రక్తంలో హిమోగ్లోబిన్ పెంచుతుంది.. పోటాషియం సోడియం లభిస్తుంది.. పురుగుమందులు లేని పండ్లు కూరగాయలు తినేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.. అయితే ఈపంటలను సాగుచేయడానికి ఉద్యానశాఖ ప్రోత్సాహం కల్పిస్తుంది.. రైతులు కేవలం పంటలపైనే కాకుండా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపైనా దృష్టి సారించాలని కోరుతున్నారు.. ఇంకేదైన సమాచారం కొరకు వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..