Site icon NTV Telugu

Anjali-Balakrishna: బాలకృష్ణపై ఆసక్తికర ట్వీట్.. అంజలి ఏం ఎన్నారంటే?

Anjali Balakrishna

Anjali Balakrishna

Actress Anjali Tweet About Balakrishna: గత 2-3 రోజులుగా నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారు. ఇందుకు కారణం విశ్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్టుగా వెళ్లిన బాలయ్య.. హీరోయిన్ అంజలి పట్ల దురుసుగా ప్రవర్తించడమే. స్టేజ్‌పై అంజలిని బాలయ్య బాబు పక్కకి నెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. అంజలిని ఆయన కావాలనే నెట్టేశారంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే హీరో విశ్వక్ సేన్, నిర్మాత నాగవంశీ రియాక్ట్ అవ్వగా.. తాజాగా హీరోయిన్ అంజలి స్వయంగా స్పందించారు.

బాలకృష్ణతో తనకున్న అనుబంధం గురించి అంజలి ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. దీంతో ఈ వ్యవహారానికి ఫుల్‌స్టాప్‌ పడింది. ‘బాలకృష్ణ గారు హాజరుకావడం వల్ల గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ మరింత ఘనంగా జరిగింది. ఆయను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఇద్దరికీ ఒకరి పట్ల మరొకరికి పరస్పర గౌరవం ఉంది. మేమిద్దరం ఎన్నో ఏళ్లుగా స్నేహంగా ఉంటున్నాం. బాలకృష్ణతో మరోసారి వేదిక పంచుకోవడం ఆనందంగా ఉంది’ అని అంజలి పేర్కొన్నారు. ఈ ఈవెంట్‌లో ఇద్దరి మధ్య జరిగిన కొన్ని మూమెంట్స్‌కు సంబంధించిన వీడియోను కూడా పంచుకున్నారు.

Also Read: Aa Okkati Adakku OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆ ఒక్కటి అడక్కు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బాలకృష్ణ తనను తోసిన విషయాన్ని చెప్పకుండా ఇండైరెక్ట్‌గా ట్రోలర్స్‌కి అంజలి కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్స్ బిన్నంగా స్పందిస్తున్నారు. అంతా అయిపోయాక పోస్టు చేయడం బాలేదని, అంజలి తప్పక ఈ పోస్టు పెట్టాల్సి వచ్చిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక అంజలి నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నేడు రిలీజ్ అయింది.

Exit mobile version