NTV Telugu Site icon

Nani : ‘నాని- శ్రీకాంత్ ఓదెల’ సినిమా కోసం సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్..?

New Project (44)

New Project (44)

Nani : న్యాచురల్ స్టార్ నాని ఇటీవల ‘సరిపోదా శనివారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన తీరు అభిమానులని అబ్బుర పరిచింది. ఇక ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం నాని తన నెక్స్ట్ చిత్రాన్ని ‘హిట్’ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలనుతో రూపొందిస్తున్నాడు.

Read Also:Off The Record : అందుకే పాత పద్ధతినే తిరిగి పాటిస్తున్నారా?

కాగా, సినిమా ఇండస్ట్రీలో హీరోల మార్కెట్ ని బట్టి నిర్మాతలు బడ్జెట్ నిర్ణయిస్తారు. హీరో, దర్శకుల కాంబోతో పాటు కథను దృష్టిలో ఉంచుకుని మార్కెట్ కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. కథ డిమాండ్.. క్వాలిటీ తెరపై కనిపించి ప్రేక్షకులు మెచ్చుకుంటే పెట్టుబడి తిరిగి కలెక్షన్ల రూపంలో వస్తుంది. లేదంటే నిర్మాత నష్టపోవాల్సి వస్తుంది. ఇటీవల తెలుగు సినిమాల మార్కెట్ పెరిగింది. ఖర్చులు కూడా పెరిగాయి. అయితే నేచురల్ స్టార్ నాని తన సినిమాల నిర్మాణంలో నిర్మాతలకు ఓ కీలక విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఖర్చుల విషయంలో వెనక్కి తగ్గవద్దని సూచించినట్లు సమాచారం.

Read Also:Duddilla Sridhar Babu : మాది పేద ప్రజల కోసం పని చేసే ప్రభుత్వం

ప్రస్తుతం నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. నాని కెరీర్‌లో ఇది 33వ సినిమా. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. నాని, శ్రీకాంత్ కాంబోలో వచ్చిన దసరా సినిమాకు మించి మాస్ ఎలిమెంట్స్ తో డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనుంది. ఈ క్రమంలో నిర్మాత సుధాకర్ చెరుకూరి.. ఖర్చు విషయంలో రాజీపడవద్దని, కథ డిమాండ్ మేరకు ఖర్చు పెట్టాలని నానికి కండిషన్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా ‘హిట్-3’ ప్రాజెక్ట్ తరువాత పట్టాలెక్కనుంది. కాగా, ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే, అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Show comments