Anirudh Ravichander-Kavya Maran Wedding: కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఓనర్ కావ్య మారన్ (Kavya Maran) ఒక్కటయ్యారు. నవంబర్ 11, 2026న గ్రీస్‌లో (Greece) అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఎవరికీ ఎలాంటి ముందస్తు హింట్ ఇవ్వకుండా సడన్‌గా పెళ్లి ఫోటోలు షేర్ చేసి అందరికీ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు ఈ లవ్లీ కపుల్.
ఈ పెళ్లి వేడుకకు సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది. అనిరుధ్ మామగారైన సూపర్ స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) ఈ పెళ్లిలో ఫుల్ జోష్‌లో కనిపించారు. తన మేనల్లుడు అనిరుధ్, కొత్త జంట కావ్య మారన్, అలాగే మారన్ కుటుంబ సభ్యులతో కలిసి తన బ్లాక్‌బస్టర్ సాంగ్ ‘మన్‌సలాయో’ (Mansilayo) ధూన్‌కు అదరగొట్టే స్టెప్పులేశారు. 75 ఏళ్ల వయసులో కూడా రజనీకాంత్ చూపించిన ఎనర్జీ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. రజనీ డ్యాన్స్ చూసి అభిమానులు “థలైవర్ రాక్డ్” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
ఇక కావ్య-అనిరుధ్ లవ్ స్టోరీ విషయానికి వస్తే.. సన్ పిక్చర్స్ (Sun Pictures) సినిమాలకు అనిరుధ్ మ్యూజిక్ అందించిన సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు ప్రచారం జరిగింది. కానీ, ఎక్కడా తమ రిలేషన్‌షిప్ గురించి బయటపెట్టకుండా నేరుగా పెళ్లి ఫోటోలతోనే గుడ్ న్యూస్ చెప్పారు. ‘My once in a lifetime, for a lifetime ❤️ 11.11’ అంటూ కావ్య మారన్ తన పెళ్లి ఫొటోను షేర్ చేశారు. ఈ ఫోటోలో ఐవరీ కలర్ కుర్తా, మ్యాచింగ్ వెష్టి, ఎంబ్రాయిడరీ జాకెట్‌లో అనిరుధ్ చాలా క్లాసీగా కనిపించగా.. బ్లష్-పింక్ లెహంగా, హెవీ ఛోకర్ ఇయర్ రింగ్స్‌లో కావ్య రాజసం ఉట్టిపడేలా రాయల్ లుక్‌లో అదరగొట్టేశారు. సముద్ర తీరాన తెల్లటి పూల మండపంలో ఒకరినొకరు కళ్లలోకి చూసుకుంటున్న ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. సినిమా రంగం, క్రికెట్ ప్రపంచం నుంచి వచ్చిన ఈ క్రేజీ కపుల్‌కు ఇప్పుడు సోషల్ మీడియాలో సెలబ్రిటీల నుంచి ఫ్యాన్స్ వరకు అందరూ పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఐపీఎల్ (IPL) మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఉత్సాహపరిచే కావ్య మారన్ ఇప్పుడు తమిళ సంగీత ప్రపంచపు రారాజు అనిరుధ్ భార్యగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
Superstar Rajinikanth dancing in Anirudh wedding 🕺🏻 https://t.co/jfB5KAU6Sn
— ORCHESTRAL GURL 🐥 (@metroproposal) November 11, 2026

