Site icon NTV Telugu

Anirudh Ravichander-Coolie: అనిరుధ్.. సౌండ్ లేదేంటి?

Anirudh Ravichander

Anirudh Ravichander

ప్రస్తుతం కొందరు హీరోలు, దర్శక, నిర్మాతలు సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచంద్రన్ ఉంటేనే సినిమా చేస్తామనే పరిస్థితిలో ఉన్నారు. యంగ్ సెన్సేషన్ అనిరుధ్ తనదైన మ్యూజిక్‌తో సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లడమే అందుకు కారణం. ముఖ్యంగా బీజీఎం విషయంలో థియేటర్ నుంచి బయటికకొచ్చాక కూడా అనిరుధ్‌నే గుర్తుకు వచ్చేలా ఉంటుంది. విక్రమ్, జైలర్ సినిమాలను అనిరుధ్ లేకుండా అస్సలు ఊహించుకోలేము. అందుకే ఆయనకు తమిళ్‌లోనే కాకుండా తెలుగులోను ఫుల్ డిమాండ్ ఏర్పడింది.

ఒక్కో సినిమా కోట్లకు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న అనిరుధ్.. ఇటీవల తెలుగులో దేవర, కింగ్డమ్ సినిమాలకు పని చేశాడు. అయితే అనిరుధ్ ఏ సినిమా చేసిన సరే ప్రత్యేకంగా ఆయన బీజీఎం గురించి మాట్లాడుకోవాల్సిందే. కానీ లేటెస్ట్‌గా వచ్చిన ‘కూలీ’ విషయంలో మాత్రం సోషల్ మీడియాలో అనిరుధ్ గురించి పెద్దగా సౌండ్ వినిపించడం లేదు. లోకేష్ కనగరాజ్, రజనీకాంత్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాకు అనిరుధ్ తనదైన స్టైల్లో అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. కానీ విక్రమ్, జైలర్ సినిమాలతో పోలిస్తే మాత్రం కూలీపై తన ఇంపాక్ట్ కాస్త తక్కువగానే ఉందని చెప్పాలి.

Also Read: Independence Day 2025: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆసక్తికర సన్నివేశం.. ఒకే వేదికపై రాజకీయ ప్రత్యర్థులు!

కూలీ రిలీజ్‌కు ముందు మోనిక సాంగ్‌తో అనిరుధ్ రవిచంద్రన్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఎక్కడ చూసినా, విన్నా మోనిక సాంగే హల్చల్ చేసింది. దాంతో విక్రమ్, జైలర్ సినిమాలకు మించి మ్యూజిక్ ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో అనిరుధ్ పెద్దగా సౌండ్ చేయలేకపోయాడనే చెప్పాలి. అసలు సూపర్ స్టార్‌కు ఇచ్చే ఎలివేషన్ పీక్స్‌లో ఉంటుంది. జైలర్‌లో హుకుం అంటూ.. థియేటర్‌ను షేక్ చేశాడు. కానీ కూలీకి అలాంటిదేమి లేదన్నట్టుగానే అనిపించింది. అనిరుధ్ ఇంకాస్త బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తే బాగుండేది అని ఫాన్స్ అంటున్నారు.

 

Exit mobile version