Anirudh Kavya Maran Wedding: గ్రీస్‌లో ఘనంగా అనిరుధ్ – కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్..!

Anirudh Kavya Maran Wedding

Anirudh Kavya Maran Wedding

Anirudh Kavya Maran Wedding: సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సీఈఓ కావ్య మారన్ వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ యూరప్‌లోని గ్రీస్‌లో అత్యంత వైభవంగా జరుగుతోంది. రెండు రోజుల పాటు సాగే ఈ వివాహ వేడుకలు నిన్ననే ప్రారంభం కాగా, నేడు ప్రధాన ఘట్టమైన వివాహం జరగనుంది. గ్రీస్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన శాంథోరిని సమీపంలో ఈ వివాహ వేడుకలను అత్యంత గోప్యంగా నిర్వహిస్తున్నారు. ఇరు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. వేడుక ప్రైవసీని కాపాడుతూ అతిథుల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సూపర్ స్టార్ రజినీకాంత్, ఆయన కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ ఇప్పటికే గ్రీస్‌కు చేరుకున్నారు. వీరితో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కుటుంబం, ఉదయనిధి స్టాలిన్ కుటుంబ సమేతంగా వివాహ వేదిక వద్దకు చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. గ్రీస్‌లో వివాహతంతు పూర్తయిన తర్వాత.. నవంబర్ 21న చెన్నై నగరంలో భారీ ఎత్తున రిసెప్షన్ వేడుకను ఏర్పాటు చేయనున్నారు. ఈ విందుకు సినీ, రాజకీయ, క్రీడారంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరుకానున్నారు.