NTV Telugu Site icon

Animal : యానిమల్ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

Whatsapp Image 2023 11 20 At 2.48.40 Pm

Whatsapp Image 2023 11 20 At 2.48.40 Pm

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్.., అర్జున్‌ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు మ్యూజికల్ అప్‌డేట్ కూడా ఇవ్వగా సినీ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఇక ఈ సినిమా డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. యానిమల్ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ముఖ్యంగా ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 21న విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు ఫేక్ అని చెబుతూ ట్రైలర్‌కు సంబంధించి చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన ఇచ్చింది.

ఈ మూవీ ట్రైలర్‌ను నవంబర్ 23న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలుపుతూ.. ‘వేచి ఉండటం విలువైనది’. యానిమల్ ట్రైలర్ నవంబర్ 23న రాబోతుంది అంటూ మేకర్స్ తెలిపారు. దీనితో పాటు ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.మరోవైపు ‘యానిమల్’ టీమ్ బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో లో పాల్గొన్న విషయం తెలిసిందే. రణ్‍బీర్ కపూర్, రష్మిక మరియు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పాల్గొన్న ఈ అన్‍స్టాపబుల్ పాన్ ఇండియా ఎపిసోడ్‌ను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ ఆహా లో నవంబర్ 24 న స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా టీం ప్రకటించింది.. అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సందీప్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం కావడం తో సినిమా పై భారీగా అంచనాలు వున్నాయి..రీసెంట్ గా ఈ సినిమా రన్ టైం 3 గంటల 21 నిముషాలు ఉన్నట్లు వార్త వైరల్ అవుతుంది..

https://twitter.com/imvangasandeep/status/1726506755562295509?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1726506755562295509%7Ctwgr%5E82e37b07d3189c0d0f86abbc26d7ae7f07458e43%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F